జగన్ అధికారంలోకి వచ్చిన క్షణమే ఓ మాట చెప్పాడు.  రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించాలి.  ఎక్కడా ఏ శాఖలో కూడా అవినీతి జారకుండా చూసుకోవాలి.  ఎక్కడైనా సరే అవినీతి జరిగితే.. దానిని ప్రతి ఒక్కరు ఖండించాలి.  ఏ అధికారి అవినీతికి పాల్పడ్డా.. ఏ మంత్రి అవినీతికి పాల్పడ్డా సహించేది లేదని వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే చెప్పారు.  


చెప్పినట్టుగానే జగన్ తన పనిని తానూ చేసుకుంటూ పోతున్నాడు.  మంత్రి వర్గంలో ఐదుగురు వ్యక్తులు మంత్రులపై జగన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈ ఐదుగురు జాబితాలో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నట్టు సమాచారం.  


సదరు మహిళకు మంత్రి పదవి దక్కడమే ఎక్కువ అనుకుంటున్న సమయంలో... ఆ శాఖలో ఆమె భర్త జోక్యం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.  ప్రతి విషయాన్నీ ఆయన చూసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని జగన్ కు సమాచారం అందింది.  


దీంతో పాటు ఓ సీనియర్ మంత్రి కూడా అవినీతికి పాల్పడుతున్నట్టు సమాచారం.  అలానే, ఓ మంత్రి రెండు కోట్ల కోసం చేతులు చాచారని తెలుస్తోంది.  వీరితో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారట.  వీరికి జగన్ ఇప్పటికే ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.  అప్పటికి వీరి ప్రవర్తనలో మార్పులు రాలేదని తెలుస్తోంది.  త్వరలోనే వారికి ఉద్వాసన పలుకుతారని వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: