అనుభవం అన్నారు చంద్రబాబు, తానే ముక్కలైన ఏపీని చక్కదిద్దుతానని కబుర్లు  గొప్పగా చెప్పి పదేళ్ళ అధికార దాహాన్ని తీర్చుకున్నారు. అంతేనా కట్టు బట్టలతో తరిమేసారంటూ ఓ వైపు పోసుకోలు కబుర్లు చెబుతూ అప్పులు.. గొప్పలతో చివరికి ఏపీకి తిప్పల పాలు చేశారు. ఇది వూరికే అన్న మాటలు కాదు. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఆధారసహితంగా శ్వేతపత్రం విడుదల చేస్తూ చెప్పిన కఠొర సత్యాలు


ఏపీ ఆర్ధికంగా చితికిపోయింది, ఆర్ధిక రేటు దారుణంగా పతనమైంది. అభివ్రుద్ధి అన్నది ఉత్త గాలి మాట. ఏదో అద్భుతం తామే చేశామని చెప్పుకున్న చంద్రబాబు సర్కార్ అయిదేళ్ల కాలానికి గానూ ఏపీని పూర్తిగా అప్పులమయం చేసిందన్నది బుగ్గన ఈ రోజు విడుదల చేసిన  శ్వేతపత్రం సాక్షిగా  నిరూపించారు.


ఏపీలో ఎంత అప్పు ఉందంటే కేంద్ర మార్గదర్శకాలను సైతం దాటేసి వీలున్నంతగా ఎక్కడిక్కడ అప్పులు తెచ్చేశారు. ఇపుడున్న పరిస్థితుల్లో తెచ్చిన  అప్పులకు వడ్డీలు ఇరవై వేల కోట్ల రూపాయలు కట్టాల్సివస్తోంది. ఇది నిజంగా దారుణాతి దారుణం. బుగ్గన శ్వేత పత్రం చూస్తూంటే ఏపీ అట్టడుగుకు వెళ్ళిపోయిందని అర్ధమవుతోంది. ఇప్పట్లో కోలుకుంటుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.  ఆర్ధిక క్రమశిక్షణ తప్పిన పాలనకు ఇదొక పచ్చి ఉదాహరణ


మరింత సమాచారం తెలుసుకోండి: