రోజాకు ఫైర్ బ్రాండ్ పేరుంది. తన పర అన్న తేడా లేకుండా అందరికీ  ఆమె షాకులిచ్చేస్తుంది. రోజా ముక్కుసూటి మనస్తత్వం గల నాయకురాలు. సినిమా నటి కావడం వల్ల రాజకీయాలు వంటబట్టవ్. అయితే ఆమె తన నోటితో, ధాటితో వైసీపీకి పెద్ద ఎసెట్ అయ్యారు.


ఇదిలా ఉండగా రోజా అలకను తీరుస్తూ జగన్ అన్న ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.  మొత్తానికి . చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాకు  ఒక పదవి లభించింది. ఆమెను ఎపి ఐఐసి చైర్ పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వైఎస్ కాంగ్రెస్ మహిళా విభాగం అద్యక్షురాలిగా కూడా ఉన్న ఆమె తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు.కాని వివిధ సమీకరణల వల్ల ఆమె కు మంత్రి పదవి ఇవ్వలేదు.దాంతో ఆమె కొంత అసంతృఫ్తికి గురయ్యారు. 


ఈ నేపద్యంలో రోజాకు ఎపిఐఐసి చైర్ పర్సన్ పదవిని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చారు.కాగా ఇంకా గత ప్రభుత్వం నియమించిన బిసి వర్గాల కార్పొరేషన్ ల పదవుల నుంచి తప్పుకోని వారిని తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోజాకు పదవి ఇవ్వడంతో టైమింగ్ ఇపుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ వైపు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. రోజా వంటి గట్టి వాణి కావాలి. అందుకే ఏ నామినేటెడ్ పదవులు భర్తీ చేయని జగన్ ఒక్క రోజాకు మాత్రమే పదవి ఇవ్వడం అంటే జగన్ కి ఆమెకు ఇచ్చిన గుర్తింపు ఇక్కడ ముఖ్యమంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: