ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ఎన్నికల్లో  టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది . ఆ పార్టీ  కేవలం 23 సీట్లను మాత్రమే దక్కించుకుంది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీకి , వైకాపా నేతలు ఒకరి తరువాత మరొకరు  ఝలక్ ఇస్తున్నారు. టీడీపీ తరుపున ఎన్నికైన  ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నిక చెల్లదని, వారి శాసనసభ్యత్వాన్ని  రద్దుచేయాలని కోరుతూ వైకాపా తరుపున పోటీ చేసి ఓటమి పాలయిన  అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి  పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.


ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు పై అనర్హత వేటు వెయ్యాలని  కోరుతూ , వారి ఎన్నికను సవాల్ చేస్తూ వైకాపా  తరఫున పోటీచేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే . ఇక తాజాగా, వల్లభనేని వంశీ మోహన్ రావు వంతు వచ్చింది . గుడివాడ నుంచి పోటీ చేసిన వైకాపా అభ్యర్థి  వెంకటరావు , వంశీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించారు .


అయితే వైకాపా తరుపున పోటీ చేసి పరాజయం పాలయిన అభ్యర్థులు వివిధ కారణాలను చూపెడుతూ టీడీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు . నిమ్మకాయల చినరాజప్ప తన ఆదాయ మార్గాలను వెల్లడించలేదని పెద్దాపురం వైకాపా అభ్యర్థి తోట శ్రీవాణి హైకోర్టును ఆశ్రయించగా , కరుణం బలరాం తన సంతానం వివరా లు వెల్లడించే  విషయం లో గోప్యత పాటించి ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించడాన్ని ఆయనపై అనర్హత వేటు వేయాలని చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కోరుతున్నారు. అయితే వైకాపా అభ్యర్థులు కోరుతున్నట్లుగా టీడీపీ అభ్యర్థుల శాసన సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేస్తుందా ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న .


మరింత సమాచారం తెలుసుకోండి: