నెల రోజులైపోయింది ఆ ఇద్దరూ ముఖా  ముఖీ కలసి. అందుకు వేదిక ఇపుడు సిధ్ధమైంది. దాంతో ఈ ఇద్దరూ మళ్ళీ ఒకే చోట సమావేశమవుతారు. ఈ ఇద్దరిపైనే ఏపీ చూపూ. కెమెరా కళ్ళు కూడా ఇటువైపే. ఎందుకంటే వారిద్దరూ ఇపుడు ఏపీలో అగ్ర నాయకులు కాబట్టి.


ఏపీ శాసనసభ సమావేశాలు ఈ రోజుతో మొదలవుతున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్, ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు కనిపించనున్నారు. ఈ రకంగా హోదాలు మార్చుకున్న తరువాత ఇద్దరూ అసెంబ్లీకి రావడం ఇది రెండవ సెషన్లో జరుగుతోంది. తొలి సెషన్లో బాబు విపక్ష నేతగా చాలా ఇబ్బంది పడ్డారు.  సీఎమ్ గా జ‌గన్ కులాసా చేస్తూంటే బాబు మాత్రం తెగ ఇరకాటంగా ఫీల్ అయ్యారు.


మరి ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలకు దగ్గర పడుతోంది కాబట్టి బాబు ఇపుడు వాస్తవ పరిస్థితికి వస్తారా. తన పాత్ర విపక్షమని ఆయన గ్రహించి దానికి తగినట్లుగా హుందా రాజకీయం చేస్తారా అన్నది అందరూ గమనిస్తారు. ఇక ఘోర ఓటమిని బాబు ఎంతవరకూ డైజెస్ట్ చేసుకున్నారన్నది కూడా ఈ సమావేశాల్లో తెలిసిపోతుంది.అ జగన్ బాబుల మధ్య మాటల తూటాలు ఉంటాయా అన్నది కూడా మరో ఇంటెరెస్టింగ్ పాయింట్.


మరింత సమాచారం తెలుసుకోండి: