ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యాధిక మెజార్టీతో గెలిచి ఎంతో సంతోషంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సురేశ్ ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.   

మంత్రి కన్నబాబుకు ఇద్దరు సోదరులు కాగా, సురేశ్ పెద్ద తమ్ముడు. విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో కన్నుమూసిన సురేశ్ మృతదేహాన్ని స్వస్థలం కాకినాడకు తరలిస్తున్నారు.  గతంలో విశాఖపట్టణంలో సురేశ్ ప్రముఖ దినపత్రికలో విలేఖరిగా పనిచేశారు.  తర్వాత పాత్రికేయ వృత్తిని రియలెస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

రెండో సోదరుడు కల్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘సోగ్గాడే చిన్నినాయన’ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కాగా, కన్నబాబు సోదరుడి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: