ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రాజకీయ వాతావరణ వేడెక్కింది. కరువు, ప్రాజెక్టులపై జరుగుతున్న చర్చలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య వాగ్యుద్దానికి దారి తీసింది. సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడిన సీఎం జగన్.. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రంగా విమర్శించారు.


చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి డ్యాం పెంచారని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అంతేకాదు.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంభోత్సవానికి వెళ్లడాన్ని టీడీపీ తప్పుబడుతోందని.. మరి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించేటప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని జగన్ ప్రశ్నించారు.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే మంచిదే కదా అని జగన్ అన్నారు.


గోదావరిపై ప్రతిపక్షానికి క్లాస్ పీకుతాన్న సీఎం జగన్... గోదావరి ప్రవాహం, పాయలపై వివరించారు. టీడీపీని ఉద్దేశించి ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచంలో ఉండదని తీవ్రవ్యాఖ్యలు చేశారు.


జగన్ వ్యాఖ్యలపై టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని జగన్ అనడంపై ఆ పార్టీ అభ్యంతరం తెలిపింది. అయితే తాను సామెత చెప్పానంటూ జగన్ తన మాటలను సమర్థించుకున్నారు. సామెత చెబితే తప్పేంటన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: