ప్రస్తుత ఎన్నికల్లో విశేషమైన ప్రజాదరణతో జగన్ మోహన్ రెడ్డి గారి ఆద్వర్యంలోని వైసిపి పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుని, అధినేత వైస్ వైఎస్ జగన్ సీఎం గా పీఠాన్ని అధిష్టించడం జరిగింది. ఇక అయన సిఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి ఇప్పటివరకు దాదాపుగా అయన పాలనపై ఎక్కువ శాతం ప్రజలు మంచి మార్కులే వేస్తున్నట్లు కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నిజానికి ఎంతటి నాయకుడికైనా వ్యతిరేకత అనేది తప్పదని, కాబట్టి అది కొంత జగన్ గారి పై కూడా ఉందనేది వారు చెప్తున్న మాట. ఇక అయన ఎన్నికల సమయంలోను అలానే అంతకముందు రెండు మూడేళ్ళ నుండి నవరత్నాలు అనే కాన్సెప్ట్ ని ప్రజల ముందుకు తీసుకువెళ్లి వాటిని సవివరంగా వివరించడం జరిగింది. 

ఒకవేళ ఎన్నికల్లో తాము గెలిస్తే, తమ మొదటి కర్తవ్యంగా నవరత్నాలలో అన్ని కార్యక్రమాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నెరవేర్చితీరుతాం అని అధినేత జగన్ స్పష్టం చేయడం జరిగింది. ఇక అనుకున్నట్లుగానే అధికారం రావడంతో సీఎం జగన్ సహా వైసిపి పార్టీ నాయకులందరూ కూడా నవరత్నాల అమలుపైనే పూర్తిగా దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇక జగన్ సీఎంగా తన తొలి సంతకం కూడా వృద్దులకు పెన్షన్లు పెంపు ఫైల్ మీదనే చేయడం జరిగింది. ఇక అందులోని మిగతా అంశాలపై కూడా జగన్ దృష్టి సారించారట. అయితే అందులోని అంశాల్లో చాలావరకు అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఒక్క మధ్య నిషేధం మాత్రం వైసిపి వారు అమలు చేయలేరని కోదిరోజులుగా వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే మద్యం పాలసీలపై తన టీమ్ తో కలిసి సమాచారం సేకరించి వాటిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్, రాబోయే రోజుల్లో మద్యంపై మరిన్ని కఠినతర ఆంక్షలు తీసుకురాబోతున్నట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం ప్రకటం మరొక నాలుగేళ్లలో అవకాశం ఉన్నంతవరకు మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేసి, సాధారణ ప్రజలు ఆ మహమ్మారికి బానిసలు కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్యం లక్ష్యం అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారట. మరి ఇప్పటివరకు ప్రజలకు అవకాశం ఉన్నంతవరకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దూసుకెళ్తున్న సీఎం వైయస్ జగన్, రాబోయే రోజుల్లో మరింత దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళ్లగలిగితే, 2024లో ఆయన మరొక్కసారి గెలిచి సీఎం అవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: