గత కొన్ని రోజులుగా ఉత్కంఠను రేపిన కర్ణాటక రాజకీయం చివరి అంకానికి చేరుకుంది. సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది. ఆ రాష్ట్ర గవర్నర్ ని కలిసి సీఎం కుమార్ స్వామి రాజీనామా లేఖ సమర్పించబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.  రెబెల్ ఎమ్మెల్యేలను సముదాయించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో... అసెంబ్లీ రద్దుకు ముఖ్యమంత్రి కుమారస్వామి సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. కేబినెట్ మీటింగ్ అనంతరం గవర్నర్ ను కలిసి కుమారస్వామి రాజీనామా పత్రాన్ని అందిస్తారని సమాచారం.  తాాజాగా ఈ వార్తలపై కుమారస్వామి కాస్త ఘాటుగా స్పందించారు.


ఇలాంటి సంక్షోభ పరిస్థితే 2010లో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు తలెత్తిన సంగతి తెలుసు కదా.. అప్పుడు ఆయన రాజీనామా చేశారా? రాజీనామా చేసే ప్రసక్తే లేదు అని కుమారస్వామి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. మరి గవర్నర్ ని కలిసిన తర్వాత కుమార స్వామి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: