రాష్ట్రంలోని పలు పాఠశాలలు పాడైపోయిన , కాలం చెల్లిన బస్సులు తిప్పుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనాయకులు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో పరిశీలన లేకుండా పర్మిషన్‌ ఇవ్వడంతో ఈ ప్రమాదాలకు ఆష్కారం ఏర్పడుతోందని ఆరోపించారు. 


ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ప్రైవేటు పాఠశాలల తీరు మారడంలేదన్నది ఈ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన విషయాన్ని బట్టి అవగతమవుతోంది.  ప్రతి ఏటా రోడ్డు రవాణా శాఖ అధికారులు పాఠశాలల బస్సులను తనిఖీ చేస్తుంటారు. అందుకు 30 అంశాలతో కూడిన డేటా షీట్‌ను పరిశీలిస్తూ వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా అంటే బ్రేకులు, అద్దాలు, ఫుట్‌ రెస్ట్‌, సిగ్నల్‌ లైట్లు తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని అనుమతి నిరాకరిస్తారు.


అయితే గతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ పాఠశాల బస్సులు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త ప్రభుత్వంలో కూడా జరుగుతుండటం విచారకరం. ప్రభుత్వాలు ఎన్ని అదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయి అథికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతోనే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: