2019 ఎన్నికలకు ముందు గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేసిన పసుపు కుంకుమ పథకం నిధులపై విచరణ జరపాల్సిందిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తారు. అప్పట్లో చేసిన ఈ తప్పిదం వల్ల కొన్ని శాఖల నిధులు దారిమల్లించినట్టు ఆయన వెల్లడించారు. ఎన్నికల ముందు రెండు నెలల నుంచి రాష్ట్రంలో బడ్జెట్‌ లేదని చెప్పడం జరిగిందని చెబుతుండేవారని తెలియజేశారు.


గత రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉండటంతో సందేహం కలిగి విచరణ చేపడితే పలు శాఖలకు చెందిన నిదులను మల్లించనట్టు తెలిసిందని, అయితే ఇది ఎంతవరకూ వాస్తవమనేది తనకు తెలియదని ఆయ బదులిచ్చారు. ఈ వ్యవహారంపై వాస్తవాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉందన్నారు.


ఈ నిధుల వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి, అసెంబ్లీ స్పీకర్‌ కూడా దృష్టి సారించాల్సిందిగా ఎమ్మెల్యే రాంబాబు కోరారు. తక్షణమే ఈ వ్యవహారాన్ని పరిశీలించి ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఆయన కోరారు. ప్రస్తుత ఎమ్మెల్యేలకు, మాజీ శాసన సభ్యులకు మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి చాలా సిగ్గుచేటుగా ఉందని ఆయన సభలో ప్రస్తావించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: