అధ్యక్షా.... జగన్‌ ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయ్యింది...  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నెల రోజుల్లో పూర్తవుతుందా... ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ఐదేళ్లూ చంద్రబాబు ఏం చేశారు. అక్కడ కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టారు.  ఆయన అధికారంలో ఉండగానే ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచడం మొదలుపెట్టారుంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై నిప్పులు చెరిగారు. 


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది.  పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లానని. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశ్యంతో వెల్లినట్టు ఆయన వెల్లడించారు. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విన్నపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గౌరవించారని,  ఆయన ఓ అడుగు ముందుకేసి తన రాష్ట్రం నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు చెప్పారు. తెలంగాణ నుంచి గోదావరి నీటిని తీసుకుంటున్నాం. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, కృష్ణా ఆయకట్టుకు నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాల్సిందిగా జగన్‌ సూచించారు. 


చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న కాలంలోనే ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచారని, పలు ప్రాజెక్టుల నిర్మాణాలు, దాని విధివిధానాలు గత ఐదేళ్లలో చేపట్టి ఇప్పడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లారని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం చూస్తే ... ఇక ఆ పెద్ద మనిషిని ఏ మనలో అర్ధం కావటంలేదని జగన్‌ వాపోయారు. చివరికి చంద్రబాబు అంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరని బాధాతప్త హృదయంతో దుయ్యబట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: