వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ/ వార్డ్ వలంటీర్ల నియామకం కోసం ఇప్పటికే ధరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. గ్రామ/వార్డ్ వలంటీర్ల నియామకం కోసం ఈరోజు నుండి ఈ నెల 25 దాకా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గ్రామ వలంటీర్లకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు మీ ఇంటర్వ్యూ ఎప్పుడు ఎక్కడ జరగబోతుందనే ప్రశ్నకు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. 
 
ముందుగా గ్రామ వలంటీర్ వెబ్ సైట్లోకి వెళ్ళి లాగ్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళాలి. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అప్లికేషన్ ఐడి ఏదో ఒక దానిని ఎంచుకుని నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ చూపిస్తుంది. చూపించిన అప్లికేషన్లలో ఇంటర్వ్యూ డేట్, పానెల్ నేమ్, స్లాట్ ఇలా మన ఇంటర్వ్యూకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. 
 
గ్రామ వలంటీర్లుగా ఈ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఆగస్ట్ 15వ తేదీ నుండి విధుల్లోకి తీసుకుంటారు. రేషన్, ఫించన్, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అమలు చేయడం కోసం ప్రభుత్వం గ్రామ వలంటీర్లను ప్రభుత్వం వినియోగించుకోబోతుంది. ఈ గ్రామ/వార్డ్ వలంటీర్ల నియామకం రాష్ట్రంలో కొంతమేర నిరుద్యోగం తగ్గుతుండటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: