పీకల లోతు అక్రమాలలో కూరుకుపోయిన ఇంజినీర్  శాఖల భరతం పట్టడానికి సర్కార్ ఉపక్రమిస్తోంది. రహదారులు, భవనాలు , గిరిజన సంక్షేమం, పంచాయితీరాజ్ వంటి ప్రధాన ఇంజినీర్ శాఖల్లో అడ్డగోలు  వ్యవహారాలపై చర్యలు తీసుకోవడానికి జగన్ సర్కార్ రంగంలోకి దిగింది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనుల్లో కొన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మరికొన్ని ఇంకా ప్రారంభం కాలేదు. కావలసిన వారికి ఇంజినీర్ శాఖల్లో పనులను అప్పగించారు. టెండర్ల నిబందనలు, నియామకాలను తుంగలోకి తొక్కేశారు.


ఒకే రహదారిని బిట్లు బిట్లుగా విభజించి టెండర్లు లేకుండా చేసి నామినేషన్ పద్దతిలో అనుకున్న వారికి కట్టపెట్టారు. అంతే కాకుండా వారికి అడ్వాన్సులు కూడా ఇచ్చేసారు. దీని దృష్ట్యా చేసిన పనుల్లో నాణ్యతాలోపం , ఇతర అంశాలను ఆరాతీయడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సీతం పేట ఐటిడిఏ పరిధిలో 20 సబ్  ప్లాన్ మండలాలు ఉన్నాయన్నారు. సుమారు 350 కి పైగా గ్రామాలకు రహదారులు లేవు. అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడానికి రెండేళ్ల క్రితం ఉపాధి హామీ పథకం , పీఎంజెఎస్, వైఎస్ డిఎఫ్ పథకం పేరిట పలు రహదారి పనులు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయినా ఇప్పటికి గిరిజన గ్రామాలకు రహదారులు పూర్తిస్థాయిలో నిర్మించలేక పోయారు.


కొన్ని గ్రామాలకు వెళ్లాలంటేనే భయం వేస్తుంటుంది. ఇంజినీర్ శాఖల్లో అవకతవకలకు పాల్పడిన అక్రమార్కుల పనిపట్టేందుకు కొత్త ప్రభుత్వం కొన్ని ప్రాధమిక నిబంధనలను అమలుచేసింది. వీటిని అనుసరించి అంచనాలలో 25 శాతం లోపు పని జరిగి ఉండి ఉంటే అలాంటి వాటిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అంతకు పైబడి జరిగిన పనులు , వాటికి బిల్లుల తయారీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకోని వాటిని కొనసాగించడానికి అనుమతిస్తారు. పని ఒప్పందం కుదిరి ఇంకా ప్రారంభం కాకపోతే వాటిని రద్దు చేయనున్నారు. ఐటిడిఏ పరిధిలో గిరిజన సంక్షేమ ఇంజినీర్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో (124) రహదారులు లేని గ్రామాలకు రోడ్లు వేయడానికి పనులు చేపట్టగా (108)  మాత్రమే పూర్తి చేశారు.


టిడిపి ప్రభుత్వం హయాంలో ఐటిడిఏ పరిధిలో 42 రహదారులలో అక్రమాలు జరిగాయని ప్రజాప్రతినిధులు ఐటిడిఏ పాలవర్గ సమావేశంలో నిలదీశారు. వీటిలో కేవలం 11 రహదారులపై మాత్రమే విచారణ చేసి వదిలేశారని అన్నారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న రహదారులలో  సాన్యతపరమైన లోపాలున్నాయని సాక్ష్యత్తు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అధికారులే ఎత్తుచూపారు. 20 రహదారులకు సంబంధించిన ఎం బుక్ లను సీజ్ చేసి పట్టుకువెళ్లినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్స్ రూపంలో ట్రైబల్ వెల్ఫేర్  ఇంజనీర్ శాఖ పనులకు రూ.3 కోట్లు పైగా నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: