ప్రస్తుతం ఏపిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. తాజాగా బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు మాత్రమే అయిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఏపీలో కరవుపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..విశాఖపట్నం లాంటి నగరంలో రెండ్రోజులకు ఓసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుందంటే, గత ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడమే కారణమని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల గురించి కానీ, ముందు తరాల భవిష్యత్ గురించి కానీ ఏమీ ఆలోచించలేదని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు దయచేసి ఫిర్యాదులు చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు.

నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో తమను కోరలేదని బొత్స స్పష్టం చేశారు. అంతే కాదు గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలను పురుగుల కన్నా హీనంగా చూసేవారని..ప్రతిపక్షం అంటే పనికిరాని పక్షంగానే చూశారని బొత్స విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కూడా విశ్వాసంలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: