టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితం అయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి 2008లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆ పార్టీలో అయన యువరాజ్యం విభాగానికి అధ్యక్షునిగా కొంత కాలం పనిచేయడం జరిగింది. అయితే అప్పటి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోర పరాజయాన్ని చవిచూడడం, ఆపై ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో, కొంత కాలం అయన రాజకీయాలకు దూరమయ్యారు. ఇక 2014లో తానే స్వయంగా జనసేన పేరుతో ఒక పార్టీని నెలకొల్పడం జరిగింది. ఇక అదే సమయంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోవడం, ఆపై ఎన్నికలు రావడంతో ఆ సమయంలో జనసేన పార్టీ టిడిపికి మద్దతు ఇవ్వడం జరిగింది. జనసేన మద్దతుతో టిడిపి అత్యధిక స్థానాలు సంపాదించి గెలవడం జరిగింది. 

ఇక ఆ తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల అనంతరం, పవన్ టిడిపితో దోస్తీని కాదనుకున్నారు. ఇక ఇటీవలి 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగడం జరిగింది. అయితే కేవలం ఒకే ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైన జనాసేన పార్టీని, తన చివరి శ్వాస ఉన్నతవరకు నడుపుతానని అంటున్నారు పవన్. ఇక రాబోయే ఎన్నికలపై ఇప్పటినుండే దృష్టిపెడుతూ, ఇకపై ప్రజల్లోకి విరివిగా వెళ్లి, ప్రజాక్షేత్రంలోనే ఉంటూ తమ పార్టీ ప్రజలకు ఏవిధంగా సాయం చేయగలదు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టవలసిన చర్యలు వంటి వాటిపై పవన్ నిశితంగా దృష్టి సారించినట్లు సమాచారం. అవసరం అయితే రాష్ట్రవ్యాప్తంగా పవన్ త్వరలో ఒక యాత్ర కూడా చేపట్టనున్నట్లు చెప్తున్నారు. 

అయితే జనసేన ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ, ఇప్పటికే ఆంధ్రాలో పాతుకుపోయిన అధికార, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, వైసీపీలను దాటుకుని ముందుకు వెళ్లడం కష్టమని కొందరు బహిరంగంగానే అంటున్నారు. టిడిపి, వైసిపి నాయకులకు ఎవరి వ్యూహాలు వారికి ఉన్నట్లుగానే జనసేనకు కూడా కొన్ని పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయని, అయితే వాటిని కనుక పవన్ గట్టిగా అమలుచేసి ప్రజలను తమ వైపుకు తిప్పుకున్నట్లైతే, రాబోయే 2024 ఎన్నికలు జనసేనకు అనుకూలించవచ్చనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అయితే పవన్ దానికొరకు పార్టీలోని క్రింది స్థాయి వ్యక్తుల నుండి ఎంతో చైతన్యం తీసుకురావాలని, అలానే తమ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు పూర్తిగా తెలిసేలా సరైన క్యాడర్ ని పెట్టుకుంటేనే అది సాధ్యం అవుతుందని, మరి రాబోయే రోజుల్లో పవన్ ఆ విధంగా పవన్ ఎలా ముందుకు వెళతారో చూడాలని విశ్లేషకులు అంటున్నారు......!!   


మరింత సమాచారం తెలుసుకోండి: