ఈ సృష్టిలో స్నేహానికి కన్న మిన్న లేదంటారు. కడవరకూ ప్రాణ మిత్రులను గుర్తుపెట్టుకుంటారు. కానీ.. తమ కుటుంబ సభ్యుడిని ప్రాణమిత్రులను ఆయన మరణం తర్వాత కూడా గుర్తుపెట్టేవారు ఉంటారు.. అందుకు ఉదాహరణే వైఎస్‌ కుటుంబం..


కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన వైయ‌స్ఆర్‌ సీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావుకు వైఎస్ కుటుంబం నుంచి అరుదైన బహుమతి అందింది. వైయ‌స్ఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబం ఆ వైద్యున్ని అరుదైన కానుకతో గౌరవించింది. 1976 నుంచి వైయ‌స్ఆర్‌తో దుట్టాకు ఉన్న సాన్నిహిత్యాన్ని మరోమారు గుర్తు చేసుకుంటూ మహానేత సతీమణి వైయ‌స్‌ విజయమ్మ బహుమతిని పంపించారు.


వైయ‌స్ఆర్ జ్ఞాపకంగా ఆయన ధరించిన దుస్తులను డాక్టర్‌ రామచంద్రరావుకుకు బహుమతిగా అందజేశారు. వైయ‌స్ఆర్‌ 70వ జయంతి సందర్భంగా ప్రాణమిత్రుడువేసుకున్న వస్త్రాలను తన చేతితో తడుముతూ దుట్టా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.


వైయ‌స్ఆర్ ఉన్నంతకాలం తమ స్నేహానికి ఎంతో విలువ ఇచ్చారని, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబం తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తోందని ఆ మిత్రుడు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ఒక కుటుంబం విశ్వసనీయతను పెంచుతాయి. ప్రజల్లో ఆదరణకు కారణమవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: