ఈ కాలంలో మనిషి డబ్బు కోసం ఎన్ని బాదలు పడుతున్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  నిరుపేద నుంచి బిలీనియర్ వరకు డబ్బెవరికి చేదు. అయితే డబ్బు ఉన్నఫలంగా ఒక్కసారే కలిసి వస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఇది కేవలం ఒక్క లాటరీ ద్వారానే సాధ్యం..అయితే నోట్ల వర్షం కురిసిస్తే జనాల ఆనందాలకు అవధులు ఉండవు.

అదేంటీ నోట్ల వర్షం కురవడం ఏంటీ అనికుంటున్నారా? నిజం..బుధవారం రాత్రి అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో ఒక ఆర్మీ ట్రక్‌ సూమారు కోటీ పదిలక్షల రూపాయలను(1.75 లక్షల డాలర్లు) తీసుకెళుతోంది. ఉన్నట్లుండి ఆ ట్రక్ బ్యాక్ డోర్ తెర్చుకోవడం అదే సమయానికి ఎడతెరిపి లేకుండా భీభత్సమైన గాలి రావడంతో నోట్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి చెల్లా చెదురు అయ్యాయి. ఆ మార్గం గుండా పోయే వాహనదారులు దిగి ఆ డబ్బు ఏరుకున్నారు.

చరవాణులతో చిత్రీకరించారు. ఆ దృశ్యాలు ఇపుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. 'నగదుతో కూడిన ఆర్మీ వాహనం తలుపులు ఒక్కసారిగా తెరుచుకోవడంతో ఈ సంఘటన జరిగింది. చచ్చీ చెడి అధికారులు, సిబ్బంది కొంత వరకు డబ్బు తీసుకున్నా..చాలా వరకు డబ్బు జనాల జేబుల్లోకి వెళ్లిందని వాపోయారు.  దీనిపై నెటిజన్లు ట్విట్టర్‌లో జోక్‌లు, మీమ్‌లు పేలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: