ఎన్నికలకు ముందు జనసేన పార్టీ హడావుడి కనిపించింది.  ఎన్నికల తరువాత  కొన్ని రోజులు పాటు పవన్ హడావుడి కనిపించింది.  ఇటీవలే అమెరికా వెళ్ళాడు.  అక్కడ తానా సభల్లో పాల్గొన్నారు.  ఇంకా ఇండియా తిరిగి రాలేదు.  తానా సభలు ముగిసినా ఇంకా అమెరికాలో ఉండటం వేనుక ఆంతర్యం ఏంటో తెలియడం లేదు.  


పైగా అక్కడ బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ తో మీటింగ్ తరువాత పవన్ ఎందుకు సైలెంట్ అయ్యినట్టు.  సైలెంట్ గా ఉండటం వెనుక రహస్యం ఏంటి..? ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరి మదిలో ఉన్నాయి.  ఆంధ్రాలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.  


ఈ సమావేశాల్లో చర్చించుకుంటున్న సమస్యల కంటే వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ టార్గెట్ చేసుకొని విమర్శలు చేసుకుంటున్నారు.  ఇలాంటి సమయంలో పవన్ అమరావతిలో తప్పకుండా ఉండాలి.  ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు గురించి పవన్ మాట్లాడాలి. 


అప్పుడే రాజకీయ నాయకుడిగా గుర్తింపు వస్తుంది.  అలా కాకుండా సైలెంట్ గా ఎక్కడో కూర్చొని ఉంటె ఉపయోగం ఏముంటుంది.  ఏదో ఎక్కడో కూర్చొని ఉంటే ఎప్పుడో ఒకసారి వచ్చి కనిపించి వెళ్తే ఉపయోగం సూన్యం కదా.  ఇప్పటికైనా పవన్ వీలైనంత త్వరగా వచ్చి అసెంబ్లీ సమావేశాలపై స్పందిస్తే బాగుంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: