నిండు అసెంబ్లీలో జగన్ ఒక సవాల్ విసిరారు. అది ఏకంగా ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ మీద. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు డైరెక్ట్ గా జగన్ సవాల్ చేశారు. తాను చెప్పిన దాంట్లో  కరెక్ట్ విషయం ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోతారా అంటూ జగన్ బాబుకే సవాల్ విసిరారు.


ఇక  రైతుల రుణాలపై వడ్డీలు గత ప్రభుత్వం కట్టలేదని ముఖ్యమంత్రి జగన్ చేసిన సవాల్ కు అసెంబ్లీలో సిద్దపడని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బయట మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి కి విషయం తెలియదని విమర్శించడం విశేషం. ఏడాదికి మూడువేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని జగన్ లెక్క కట్టి మరీ చెబితే తాము ఏడాదికి 175 కోట్లు బడ్జెట్ లో పెట్టామని ,గతంలో బడ్జెట్ ప్రసంగాలను చదివి వినిపించారు.


జగన్‌కు అసలు విషయంపైనే అవగాహన లేదు. 2014-15 నుంచి 2017-18 వరకు రూ.930 కోట్ల వడ్డీలేని రుణాలు చెల్లించాం. 43లక్షల 70వేల మందికి ఈ మొత్తాన్ని అందజేశాం. 2018-19కి మాత్రమే రూ.560 కోట్లు పెండింగ్‌ ఉంది’’ అని చంద్రబాబు అన్నారు. తమపై జగన్ బురద చల్లే పనిలోనే ఉంటున్నారని ఆయన అన్నారు.మొత్తం ఐదేళ్లకు కలిపి 930 కోట్లు ఇచ్చామంటున్నారు. 


సరే కొంతసేపు బాబు చెప్పిందే నిజం అనుకుందాం . మరి ఏడాదికి మూడువేల కోట్లు కావల్సి ఉంటే 930 కోట్లు ఎలా సరిపోయాయో ఆయన కూడా చెప్పాలి. ఇక ఇన్ని ఆధారాలు ఉంటే అసెంబ్లీలో చెప్పకుండా బయట మీడియా సమావేశం పెట్టి చెప్పడమేంటి. అంటే తాము చెబుతున్న విషయాల మీద బాబుకే నమ్మకం లేదన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: