ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ కు ట్విట్టర్ వేధికగా ఒక ప్రశ్న ఎదురయ్యింది. ట్విట్టర్ వేధికగా ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్ప గలిగే శక్తి ఒక్క మాజీ ఎంపీ నారా లోకేష్ కి మాత్రమే ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. అయన తెలివి తేటలు అయన మాట తీరుతోనే ప్రజలకు అర్ధమైంది. అయితే ఇప్పుడు నారా లోకేష్ కి పెద్ద సమస్య వచ్చిపడింది. 


ఆ సమస్య ఎందుకు వచ్చింది అంటే.. అయన ట్వీట్లే ఆ సమస్యకు మూలా కారణం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఆ విమర్శల్లో కొన్ని కొన్ని సార్లు తప్పటడుగులు వేసి నెటిజన్లతో చివాట్లు కూడా పెట్టించుకుంటున్నా సంగతి అందరికి తెలిసిందే. అయితే అయన ప్రతి ట్విట్ కి కచ్చితంగా ఒక నెటిజన్ తాయిబా ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడు నారా లోకేష్ అని అడుగుతూన్న సంగతి తెలిసిందే. 


అయితే ఇప్పుడు నెటిజన్లు కొత్తగా నారాలోకేష్ ను ఓ గొంతమ్మ కోరికను కోరారు. ఆ కోరికా ఏంటంటే ఒక్కసారైనా రాంగోపాల్ వర్మను విమర్శించు నాయన అని కోరుకుంటున్నారు. కారణం జగన్ చంద్రబాబుని ఒక్క మాట అన్నకూడా చేలా రేగి పోతాడు నారా లోకేష్. అలాంటిది చంద్రబాబు నాయుడుని ఈరోజు బ్రహ్మానందంతో పోల్చారు అయినా రాంగోపాల్ వర్మను ఒక్క మాట అనలేదు నారా లోకేష్. అయితే మరో నెటిజను అయితే గోరంగా కామెంట్ చేసాడు 'ఎవరితో అయినా పెట్టుకో.. ఏవిడినైనా విమర్శించు.. రాంగోపాల్ వర్మను విమర్శించావో.. 'నా రాజకీయా వారసుడివి జన్మలో కాలేవురా' అని చంద్రబాబు నారా లోకేష్ కు చెప్పినట్టు' కామెంట్ పెట్టాడు ఓ నెటిజన్. ఈ కామెంట్లకు నారా లోకేష్ స్పందించి, నెటిజన్ల కోరినట్టు రాంగోపాల్ వర్మను నారా లోకేష్ విమర్శిస్తాడు ఏమో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: