Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 7:08 pm IST

Menu &Sections

Search

ఇన్ని లక్షల కోట్లు జగన్ ఎక్కడ నుంచి తీసుకురాబోతున్నారు !

ఇన్ని లక్షల కోట్లు జగన్ ఎక్కడ నుంచి తీసుకురాబోతున్నారు !
ఇన్ని లక్షల కోట్లు జగన్ ఎక్కడ నుంచి తీసుకురాబోతున్నారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయింది. గత ప్రభుత్వం చేయాల్సిన అప్పులన్నీ చేసేసి ఇప్పటి ప్రభుత్వానికి అప్పు పట్టకున్న ఉండే పరిస్థితి వచ్చిందంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే జగన్ ఓ వైపు ఘనంగా నవరత్నాల్ని ప్రకటించారు. ఇప్పటికే పలు రాయితీలు ప్రకటించారు. కొన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించారు. వీటన్నింటినీ అమలు చేయాలంటే డబ్బుకావాలి. మరోవైపు కేంద్రం మొండిచేయి చూపించింది. బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం చేసింది. సాధారణంగా వచ్చే కేటాయింపులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రజల ముందుకు రాబోతోంది. మరి జగన్ ఏం చేయబోతున్నారు?


దాదాపు 2 లక్షల 31 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు జగన్. ఈరోజు ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ను సభలో చదివి వినిపిస్తారు. నవరత్నాల అమలులో భాగంగా ఏ వర్గానికి ఎన్ని కేటాయింపులు అనే విషయాన్ని వివరించబోతున్నారు. అయితే ఏ వర్గానికి ఎంత కేటాయించారు, ఏ శాఖకు ఎన్ని కోట్లు ఇచ్చారనే అంశం కంటే.. కేటాయించిన డబ్బును ఏ రూపంలో సంపాదించబోతున్నారనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టిపడింది.


కేంద్రం నుంచి ఏమీరాదని తేలిపోవడంతో.. ఇంత మొత్తాన్ని ఎలా సమకూర్చుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం అప్పు చేసే పరిస్థితి కూడా లేదు. పరిమితికి మించి అప్పు చేసి రాష్ట్రాన్ని ఇప్పటికే పూర్తిగా ముంచేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో 2 లక్షల కోట్ల రూపాయల్ని జగన్ ఎలా చూపిస్తారనేది అందర్లో ప్రశ్న. మరోవైపు గత సర్కార్ బకాయిల్ని కూడా భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite