జగన్ తానూ చెప్పాల్సిన విషయాన్ని ఏకంగా స్లైడ్స్ వేసి బాబుగారికి నోట్లో మాట లేకుండా చేసేశారు. బాబుగారు ఎన్ని అబద్దాలు ఆడారో క్లియర్ గా వీడియో రూపంలో జగన్ చెప్పడంతో పాపం టీడీపీ నాయకుల మొహలు  వాడిపోయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్తగా సభలో స్లైడ్ షో సిస్టమ్ ప్రవేశపెట్టారు. గతం కంటే భిన్నంగా తాను చెప్పదలుచుకున్న పాయింట్ ని పిన్ పాయింట్ గా స్లైడ్ షోల రూపంలో ప్రజెంట్ చేశారు.


విత్తనాల కొరత, ఇన్ పుట్ సబ్సిడీ సమస్యలను ప్రస్తావించే సమయంలో జగన్ స్లైడ్ షోలను వాడుకున్నారు. విత్తనాల కొరత సమస్య గత ప్రభుత్వ పాపం అని, తాము అధికారంలోకి రాక మునుపే విత్తనాల పంపిణీపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉండాల్సిందని, టీడీపీ ప్రభుత్వం ఆ పని చేయలేదని విమర్శించారు. అధికారులు ఎన్నిసార్లు లేఖలు రాసిందీ ఆధారాలతో సహా సభలో ప్రవేశపెట్టారు.


ఫినిషింగ్ టచ్ ఏంటంటే.. రైతు రుణమాఫీ పేరుతో చంద్రబాబు అన్నదాతల్ని ఎలా వంచించారో వీడియో క్లిప్ చూపించారు ముఖ్యమంత్రి. 2014 ఎన్నికల సమయంలో బాబు గుప్పించిన హామీలు, సీఎం అయిన తర్వాత బాబు మాట మార్చిన తీరుని ప్రజెంట్ చేశారు. ఈ వీడియో చూస్తూ బాబు కూడా షాక్ కి గురయ్యారు. జగన్ ఇలా వీడియోలతో సభకు వస్తారని పాపం చంద్రబాబూ ఊహించలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: