క్యాబినెట్ లోని మంత్రివర్గ సహచరుల పేషీలపై జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టించారా ? అమరావతి వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ఏ ఒక్క మంత్రి కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఉండాలని జగన్ మొదటి క్యాబినెట్ సమావేశం సందర్భంగానే స్పష్టంగా చెప్పారు. ఏడాదిలోగా జగన్ మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్న తన టార్గెట్ ను కూడా వివరించారు.

 

అయితే తాను ఒకటనుకుంటే కొందరు మంత్రుల పేషీల్లో మరొకటి జరుగుతోందని సమాచారం వచ్చిందట జగన్ కు. మొత్తం మీద ఐదుగురు మంత్రుల పేషీల్లో బయట వ్యక్తుల హడావుడి చాలా ఎక్కువగా ఉందట. ఆ పేషీల్లో ఎక్కువగా కుటుంబసభ్యులు, బంధుల హడావుడే ఎక్కువగా ఉందని జగన్ కు సమాచారం అందిందట. దాంతో మొత్తం వ్యవహరాలను ఆరాతీశారని సమాచారం.

 

తనకందిన సమాచారం ప్రకారం ఐదుగురు మంత్రుల పేషీల్లో బాగా అవకతవకలు జరుగుతున్నట్లు బయటపడిందట.  కొందరు మంత్రులు ఇసుక దందాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు జగన్ కు సమాచారం అందినట్లు తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరు సీనియర్ కాగా మిగిలిన నలుగురు జూనియర్ మంత్రులట.

 

ఇద్దరు మంత్రుల బంధువులు తమ మంత్రులతో ఇతర మంత్రులకు ఫోన్లు చేయించి మరీ దందాలు మొదలుపెట్టేసినట్లు తెలిసిందట.  దాంతో మంత్రులను తన దగ్గరకు పిలిపించుకుని ఫుల్లుగా క్లాస్ పీకారట. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ గా పరిగణించాలని కూడా హెచ్చరించారని సమాచారం. దాంతో మంత్రుల పేషీలతో పాటు మంత్రుల కేంద్రంగా జరిగే వ్యవహారాలపై సమాచారం తెప్పించుకునేందుకు జగన్ ప్రత్యేక నిఘా వ్యవస్ధను ఏర్పాటు చేసుకున్నట్లు అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: