Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 7:02 pm IST

Menu &Sections

Search

రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటల్లో...

రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటల్లో...
రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటల్లో...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అస్సెంబ్లీ లో గత సంవత్సరం విత్తన బకాయిల గురించి మాట్లాడుతూ, గత ప్రభుత్వం మూడు వందల ఎనభై నాలుగు కోట్లు రూపాయలు చెల్లించకుండా ఉంది అని, ఆ మూడు వందల ఎనభై నాలుగు కోట్ల బకాయిలను విడుదల చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ధాన్య సేకరణలో తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మా ప్రభుత్వం చెల్లించడానికి చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.

ఇందులో భాగంగా మూడు వందల అరవై కోట్లు విడుదల చేసామని ఆయన సగర్వంగా అన్నారు. గత సంవత్సరాని కి సంబంధించి ఏదైతే రెండు వేల కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిందో ఆ బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అని ఆయన అన్నారు. వ్యవసాయదారులకు రోడ్ టాక్స్ రద్దు చేస్తామని కూడా అన్నారు. క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కలు గమనిస్తే పదిహేను వందల పదమూడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అన్నారు. అందులో కేవలం మూడు వందల తొంభై ఒక్క మందికి మాత్రమే కొంత సహాయం అందింది అని ఆయనన్నారు. దీనికి సంబంధించి రైతు భరోసా కింద ప్రమాదపు శాత్తు కాని లేదా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఏడు లక్షల రూపాయల ఇవ్వాలనే చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అన్నారు.

ఇప్పట్నుంచే కాకుండా గతంలో జరిగిన ఆత్మహత్యలకు గత ప్రభుత్వం ఎవరికైతే సహాయం అందించలేక పోయిందో వాళ్ళకు కూడా ఏడు లక్షల రూపాయలను అందించాలనే కలెక్టర్లకు ఆదేశించామని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం నెల రోజుల్లోనే మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇవి అని ఆయన అన్నారు. రాబోయే సంవత్సర కాలంలో రైతులకు తీసుకునే సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా తుఫాన్ వచ్చిన కరువు వచ్చినా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్ లో నష్టమొస్తే రబీలోనే ఆ రైతన్నను ఆదుకునే దిశగా రెండు వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.

రాష్ట్రం లో ప్రతి రైతు కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ అక్టోబర్ పదిహేనవ తారీకు నుంచి అందించబోతున్నామని ఆయన అన్నారు. మ్యానిఫెస్టో లో చెప్పిన దానికంటే ఏడు నెలలు ముందు నుంచే ఈ రబీ సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రం లో డెబ్బై ఐదు లక్షలు రైతు కౌలు రైతు కుటుంబాలకు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అందించబోతున్నామని ఆయన అన్నారు. దాదాపు పదహారు లక్షల కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అందించబోతున్నామని ఆయన అన్నారు.

ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతు చేతులకందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లోనే కాకుండా భారతదేశ చరిత్ర లోనే ఇది ఒక రికార్డు అని ఆయన సగర్వంగా చెప్పారు. ఈ నిధులను రైతుల పాత బకాయిలలో వేసుకోకుండా నిబంధనలను తీసుకొస్తున్నామన్నారు. మూత పడిన సహకార డైరీలు చెక్కెర ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా మొదటి ఏడాది లోనే పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author