అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సున్నావడ్డీపై చర్చ సందర్భంగా  అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద రచ్చే జరిగింది.  సున్నా వడ్డీపై రైతులకు రుణాలను పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి, రైతులకు రుణాలు ఇప్పించామని చంద్రబాబునాయుడు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటంతో సభ అట్టుడుకిపోయింది.

 

చివరకు అసలుదైన సున్నావడ్డీ అంశం పక్కకు పోయి కొసరు అంశమే ప్రధానమైపోయింది. దాంతో ఒకవైపు జగన్ కు మద్దతుగా కొందరు మరోవైపు చంద్రబాబుకు మద్దతుగా కొందరు ఎంఎల్ఏలు రెచ్చిపోవటంతో సభలో గందరగోళం పెరిగిపోయింది.

 

సున్నావడ్డీపై జగన్ మాట్లాడుతున్నపుడు టిడిపి ఎంఎల్ఏలు రన్నింగ్ కామెంట్రీ చేస్తునే ఉన్నారు. రన్నింగ్ కామెంట్రీ వద్దని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఎంత చెప్పినా టిడిపి ఎంఎల్ఏలు వినకపోవటంతో జగన్ లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. దాంతో టిడిపి సభ్యులు 23 మందే అని తాను తలుచుకుంటే వైసిపి 151 మంది సభ్యులు కూడా అలాగే చేస్తారంటూ జగన్ హెచ్చరించారు.

 

దాంతో జగన్ ప్రసంగానికి టిడిపి సభ్యులు అడుగడుగునా అడ్డుపడుతునే ఉన్నారు. దాంతో ఒకళపై మరొకళ్ళు వ్యక్తిగత దూషణలకు దిగటంతో సభంతా ఉద్రిక్తంగా మారిపోయింది. ఆ దశలో స్పీకర్ జోక్యం చేసుకుని సీరియస్ అయి రెండువైపులా సర్ది చెప్పిన తర్వాత సభ ఆర్డర్ లోకి వచ్చింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: