ఏపీ అసెంబ్లీ సమావేశం ఎంతో గంభీరంగా నడుస్తుంది.  అధికార, ప్రతి పక్షాల మద్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.  గత టీడీపీ పాలనపై అధికార పక్షం నేతలు విరుచుకు పడుతున్నారు.  ముఖ్యంగా నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు..మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నేడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఇదే స్థాయిలో సాగుతున్నాయి. 


సున్నా వడ్డీ పథకంపై అసెంబ్లీలో అధికార వైఎస్సార్ కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య పలుమార్లు వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇరు పక్షాలు పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. సున్నా వడ్డీ రుణాలను అమలు చేసినట్టు నిరూపిస్తూ చంద్రబాబు సభలో రికార్డులను ప్రవేశపెట్టారు. 

సున్నా వడ్డీ అంశం చర్చ సందర్భంగా అరుపులు, కేకలతో సభ దద్దరిల్లుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సున్నా వడ్డీ పథకానికి గత టీడీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని... తనను రాజీనామా చేయాలని సవాల్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇప్పుడేమో సిగ్గు లేకుండా నవ్వుతున్నారని అన్నారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్ చేశామని చెప్పారు.ముఖ్యమంత్రి ఎందుకు అంత పరుషంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తనను రాజీనామా చేసి వెళ్లిపొమ్మంటారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా గాడిదలు కాశారా అంటారా? అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: