జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి బడ్జెట్ ను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి రూ 2. 27 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్లో రూ 1778 కోట్లను రెవిన్యు లోటుగా బుగ్గన చెప్పారు. రెవిన్యు వ్యయం 20.10 శాతం పెరుగుతుందని బడ్జెట్లో అంచనా వేశారు. మొత్తం మీద బుగ్గన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో జగన్ హామీలైన నవరత్నాల అమలుకే పెద్ద పీట వేశారు.

  

సాగునీటి సాగుకు రూ. 13,139 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ రైతు భరోసాకు రూ 8750 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ కోసం రూ 4525 కోట్లు కేటాయించారు. ధరల స్ధిరీకరణ నిధి క్రింద రూ. 3 వేల కోట్లు, విపత్తుల నిర్వహణకు రూ. 2 వేల కోట్లు, అమ్మఒడి పథకం అమలుకు రూ. 6455 కోట్లు, స్కూళ్ళల్లో మౌళిక సదుపాయాల కల్పనకు రూ. 1500 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ. 1700 కోట్లు కేటాయించారు.

 

ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనకు రూ. 1500 కోట్లు, వైఎస్సార్ గృహవసతికి రూ. 5 వేల కోట్లు, కాపు కార్పొరేషన్ కు రూ. 2 వేల కోట్లు, బియ్యం సబ్సిడికి రూ. 3 వేల కోట్లు, గ్రామ వాలంటీర్లకు రూ. 720 కోట్లు, కడప స్టీల్ ప్లాంటకు రూ. 250 కోట్లు, పట్టణాల్లో డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాలకు రూ . 648 కోట్లు, డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాల కోసం రూ. 1150 కోట్లు, ఇరిగేషన్, వరదముంపు నివారణకు రూ. 13, 139 కోట్లు కేటాయించారు బుగ్గన.

 

వ్యవసాయరంగానికి రూ 20,677 కోట్లు,  గ్రామీణాభివృద్ధికి రూ. 29, 329 కోట్లు, సాధారణ విద్యకు రూ.  32,618 కోట్లు, వైద్యరంగానికి రూ. 11,399 కోట్లు, సంక్షేమ శాఖలకు రూ. 14,142 కోట్లు, సాధారణ సర్వీసులకు రూ. 66,324 కోట్లు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు రూ. 18, 327 కోట్లు కేటాయించారు. బిసి సంక్షేమానికి 7271 కోట్లు, కాపు కార్పొరేషన్ కు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. మొత్తం మీద రైతులు, పారిశ్రామిక రంగం, మహిళా, శిశు సంకేమం తో పాటు పాఠశాల విద్య తదితర నవరత్నాల హామీల అములకు పెద్ద పీటే వేశారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: