ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కొద్దిసేపటిక్రితం 201920 ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి ప్రతిపాదనలను అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చారు. నూతన ఆంధ్రప్రదేశ్ లోని వైయస్సార్ జగన్ కొత్త ప్రభుత్వం, నూతన తరహా లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇక హామీలను నెరవేర్చే దిశగా దాదాపు రూ.2.18 లక్షల కోట్ల అంచనాలతో దీనికి ప్రణాళిక చేసింది.


తాము మొదట్నుంచీ నవరత్నాలే తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం గా చెప్పారు. రైతు భరోసా, అమ్మఒడి, వైయస్సార్ చేయూత వంటి వాటికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమమే ప్రధానంగా కేటాయింపులుంటాయని సమాచారం ఇచ్చారు. ఫించన్ లకు మాత్రమే రూ.15 వేల కోట్ల పైనే అవసరమౌతున్నాయని లెక్కించారు.


ఎన్నికల ప్రణాళికలోని అంశాలకు రూ.65,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు కేటాయింపులు ఉండబోతున్నాయని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో, మండలి పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో ప్రవేశపెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: