Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 7:52 pm IST

Menu &Sections

Search

మ‌డ‌మ తిప్ప‌ని బ‌డ్జెట్‌.. జ‌గ‌న్ తొలి ప‌ద్దు బాగు..!

మ‌డ‌మ తిప్ప‌ని బ‌డ్జెట్‌.. జ‌గ‌న్ తొలి ప‌ద్దు బాగు..!
మ‌డ‌మ తిప్ప‌ని బ‌డ్జెట్‌.. జ‌గ‌న్ తొలి ప‌ద్దు బాగు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అటు పాద‌యాత్ర స‌మ‌యంలోను, ఇటు ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వైసీపీ అధినేతగా, అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించారు. అన్ని వ‌ర్గాల‌పైనా ఆర్థిక భ‌రోసాను వ‌ర్షించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రి అభివృద్ధే ల‌క్ష్యంగా తాను ముందుకు సాగుతాన‌ని ఇచ్చిన హామీని అప్ప‌ట్లో విప‌క్షాలు స‌హా ప్రభుత్వ అను కూల మీడియా కూడా అవ‌హేళ‌న చేసింది. ఉచితాల‌తో అధికారంలోకి రావాల‌ని క‌లలు కంటున్నార‌ని, జ‌గ‌న్ ప్ర‌క‌టించిన వ‌రాలు తీర్చేందుకు కేంద్ర బ‌డ్జెట్ కూడా స‌రిపోద‌ని ఎద్దేవా చేశారు. కేవ‌లం అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా జ‌గ‌న్ వ‌రాలు ప్ర‌కటించారు త‌ప్పితే.. ఆయ‌న‌చేసిది ఏమీలేద‌ని అప్ప‌ట్లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు, ఆయ‌న టీం కూడా విమ‌ర్శ‌ల జ‌డివాన బాగానే కురిపించారు. 


అయిన‌ప్ప‌టికీ..ప్ర‌జ‌లు జ‌గ‌న్ వెంటే నిలిచారు. అప్ర‌తిహ‌త మెజారిటీతో ఆయ‌న‌కు అధికార ప‌గ్గాలు అప్ప‌గించారు. దీంతో ఏపీలో జ‌గ‌న్ రెండో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. నేటికి స‌రిగ్గా 42 రోజుల కింద‌ట జ‌గ‌న్ ఏపీ సీఎంగా మే30న ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి నేటి వ‌ర‌కు ఆయ‌న సంక్షేమం దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు(మేనిఫెస్టో) అమ‌లు దిశ‌గా వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్నారు. 


విభ‌జ‌న నేప‌థ్యంలో లోటు బ‌డ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని గ‌త ప్ర‌భుత్వం మ‌రింత అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది. అయిన‌ప్ప‌టికీ.. త‌న మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి తీరుతాన‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. సాధార‌ణంగా.. రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు మాట‌లు చెప్ప‌డానికి, చేత‌ల్లోకి వ‌చ్చేస‌రికి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక‌, అత్యంత లోటు బ‌డ్జెట్‌లో, ముఖ్యంగా ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని చెప్పిన స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ తాను ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ్డారు. 


తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2019-20 వార్షిక బ‌డ్జెట్‌లో అన్ని వ‌ర్గాల‌ను స‌మ‌తుల్యం చేస్తూ..కేటాయింపులు జ‌రిపారు. మ‌రీ ముఖ్యంగా వ్య‌వ‌సాయ రంగానికి పెద్ద‌పీట వేసిన త‌న తండ్రి వైఎస్ అడుగు జాడ‌ల్లో న‌డిచిన జ‌గ‌న్‌.. రైతుల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించారు. వైఎస్సార్ రైతు భ‌రోసాకు 8 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని కేటాయించారు. విత్త‌నాల‌కు రూ.200 కోట్ల‌ను కేటాయించారు. సాగు నీటికి 4 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని కేటాయిస్తున్న‌ట్టు బ‌డ్జెట్‌లో పేర్కొన్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో పింఛ‌న్లు, అసంఘ‌టిత కార్మిక రంగాన్ని ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డంలోను జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగారు. 


పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ మేర‌కు ఆటో ట్యాక్సీ కార్మికుల‌కు రూ.400 కోట్ల‌ను కేటాయించారు. (ఇది గ‌తంలో లేదు), అదేవిధంగా ఆరోగ్య శ్రీకి ఊపిరులు ఊదారు. ఇక‌, పాడేరు, అరకు ప్రాంతాల్లో ఎక్క‌డ బాగుంటే అక్క‌డ గిరిజ‌న వైద్య విద్యాల‌యం నిర్మించ‌డం ద్వారా అనారోగ్యంతో ఏ ఒక్క గిరిజ‌నుడు మృతి చెంద‌రాద‌నే త‌న సంక‌ల్పాన్ని నెర‌వేర్చుకున్నారు.కాపుల‌కు రూ.2 వేల కోట్లు కేటాయించ‌డం ద్వారా, క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కానికి రూ.300 కోట్లు కేటాయించ‌డం ద్వారా అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుని, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితితో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రి సంక్షేమానికి త‌న ప్ర‌భుత్వం పాటు ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.


jagan-achievements-in-ap-low-budget
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆగ‌ని కేశినేని ట్వీట్లు... ఇంత పెద్ద వ్యూహం ప‌న్నాడా...
జ‌గ‌న్ న‌యా డెసిష‌న్‌పై బాబులో టెన్ష‌న్ ఎందుకో...
వైసీపీలో ఎంపీ వ‌ర్సెస్ లేడీ ఎమ్మెల్యే
' ఇస్మార్ట్ శంక‌ర్ ' ఫ‌స్ట్ టాక్‌... పూరి - రామ్‌ ఖాతాలో మ‌రొక‌టి
బాల‌య్య‌కు అక్క‌డ పార్టీ ప‌గ్గాలు ఇస్తారా... పార్టీ గ‌తేంటో...!
ఏపీపై కేంద్రం `గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌`
' ఇస్మార్ట్ శంక‌ర్ ' ప్రి రిలీజ్ బిజినెస్‌... టార్గెట్ ఎంతంటే...
ప్ర‌భాస్ షాక్‌తో యంగ్ హీరో గిల‌గిలా...
అనిల్ రావిపూడిపై జ‌గ‌ప‌తిబాబు ఆగ్ర‌హం... మ‌హేష్‌కు షాక్‌
అఫీషియ‌ల్‌: చిరు - ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్‌కు నిర్మాత ఖ‌రారు
టీడీపీలో కొత్త పంచాయితీ.... ఈ సారి విశాఖలో వార్‌
హెరిటేజ్‌కు దెబ్బ మీద దెబ్బ‌... షేర్ మార్కెట్లో ఢ‌మాల్‌
టాలీవుడ్‌కు బిగ్ షాక్‌:  ' సాహో ' రిలీజ్ వాయిదా..
సూప‌ర్ షాక్‌: పార్టీ మారాల‌ని టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం ప్రెజ‌ర్‌...
టీవీ 5  - మ‌హాటీవీ @ రూ.300 కోట్లు
గుంటూరు టీడీపీలో బిగ్ వికెట్ డౌన్ ... డీల్ ఓకే చేసిన రామ్‌మాధ‌వ్‌
వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మ‌హేష్ మ‌న‌సు గెలిచిన జ‌ట్టు ఏదంటే...
ఇ ' స్మార్ట్ ' క్రేజ్‌.... ఫ‌స్ట్ డే బుకింగ్స్ ర‌చ్చ రంబోలా...
ఇస్మార్ట్‌కు ఏ ... ప‌చ్చిబూతులు... ఎక్స్‌పోజింగ్‌... ఇంత ఘోరంగానా...
ఐసీపీ టీమ్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్‌క‌ప్‌... భార‌త్‌కు షాక్‌
ఒకే ఫ్రేమ్‌లో సీఎం జ‌గ‌న్‌తో ఎన్టీఆర్‌.. బాల‌య్య‌
ప్ర‌పంచ‌క‌ప్‌లో టామ్ లాథ‌మ్ న‌యా రికార్డు
కీవీస్ పాలిట ఆ క్రికెట‌రే విల‌న్‌... అత‌డి వ‌ల్లే క‌ప్ పోయింది
కేసీఆర్ షాక్‌తో జంపింగ్ ఎమ్మెల్యేల గింగ‌రాలు
సాహోకు దూరంగా బ‌య్య‌ర్స్‌... రీజ‌న్ ఇదే
షాక్‌: సైరా నుంచి అత‌డు అవుట్‌..!
క‌ల‌ర్ ఫుల్ బికినీలో క‌త్రీనా... కుర్రాళ్ల మ‌తులు పోతున్న‌య్‌
ఒకే రోజు టీడీపీకి మూడు బిగ్ షాక్‌లు...
బాబు అంటే త‌మ్ముళ్ల‌కు ఇంత అలుసైపోయాడా...
చంద్ర‌బాబుపై సుజ‌నా సెటైర్లు చూశారా... ఎన్టీఆర్‌పై అంద‌రికి హ‌క్కు
ప్రపంచ‌క‌ప్ ఫైన‌ల్లో న్యూజిలాండ్ స‌రికొత్త రికార్డు
బీజేపీ లీడ‌ర్‌తో చింత‌మ‌నేని సీక్రెట్ మీటింగ్‌... జెండా మార్చేస్తాడా...
ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి హీరోయిన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు.... షూటింగ్‌లో క‌న్నీళ్లే
టీడీపీలో లుక‌లుక‌లు... ఆ ఇద్ద‌రి నేత‌ల ఫైటింగ్‌
ఈ వార్త చ‌దివితే హైద‌రాబాదీయుల గుండెలు ఆగిపోతాయ్‌
ఎక్స్‌పోజింగ్ మాత్ర‌మే వ‌చ్చా... నెటిజ‌న్‌కు నిధి షాకింగ్ రిప్లై
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.