మాజీ ఎంపీ, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న హత్య కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నార్కో టెస్ట్‌ చేసేందుకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది.


ఈ క్రమంలో ఈ రాత్రి హైదరాబాద్‌కు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు. కాగా ప్రస్తుతం ఎర్ర గంగిరెడ్డి పోలీసుల అదుపులో ఉండగా.. ఆయనను డీఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు.  ఈ కేసులో  సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో  నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు పోలీసులకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది. వాచ్‌మెన్‌ రంగన్న, కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డిలకు నార్కోఅనాలసిస్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతించిన కోర్టు గంగిరెడ్డి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. వివేకా హత్య విషయంలో భిన్నమైన కారణాలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: