బడ్జెట్ ప్రసంగం అంటే సాధారణంగా బోర్ కొడుతుంది. పథకాల లెక్కలు, కేటాయింపుల వివరాలు, గణాంకాలు, చిట్టాపద్దులతో అదో అర్థం కాని గజిబిజి గందరగోళం అన్నట్టుగా ఉంటుంది. నిపుణులకు, కాస్తో కూస్తో ఆర్థిక అవగాహన ఉన్నవారికి తప్ప మిగిలినవారికి ఇది ఆసక్తిగా అనిపించదు.


కానీ అలాంటి డ్రై విషయాన్ని కూడా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో చక్కగా ప్రజెంట్ చేశారు. అవసరమైన చోట ఛలోక్తులు, పిట్టకథలు, పురాణాలు మేళవిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తిగా చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం గురించి చెబుతున్న సమయంలో బుగ్గర సందర్భోచితంగా రామాయణాన్ని ఉటంకించారు.


రామాయంలోని రాముడి సోదరుడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్చపోయిన ఘట్టాన్ని ఆ సందర్భంగా ప్రస్తావించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రామాయణంలో రావణాసురుడు కుమారుడు ఇంద్రజిత్‌ అస్త్రానికి కుప్పకూలిన లక్ష్మణుడిని.. మూర్ఛ నుంచి లేపేందుకు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చినట్లు వైఎస్‌ఆర్‌ ఏపీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ తెచ్చారంటూ బుగ్గన వర్ణించారు.


వర్ణన కాస్త ఎక్కువగా ఉన్నట్టు చెప్పినా.. నిజంగా ఈ ఆరోగ్యశ్రీపథకం అంతటి ప్రశంసలకు అర్హమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి పేద కుటుంబం కార్పొరేట్‌ హాస్పిటల్లో నాణ్యత కలిగిన ట్రీట్ మెంట్ పొందాలనే లక్ష్యంతో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు జగన్ సర్కారు దానికి దండిగా నిధులు కేటాయిస్తూ నిబంధనలు సులభతరం చేయడం హర్షించదగిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: