అంతా కష్టజీవులు, చిరుద్యోగులు.. భవిష్యత్ అవసరాల కోసం రూపాయి రూపాయి పోగేసుకుని ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత సంస్థ నిర్వాకం కారణంగా ఆ సొమ్ము పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. వారే అగ్రిగోల్డ్ సంస్థ బాధితులు.


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ సంస్థ డిపాజిటర్లు ఉన్నారు. తమ సొమ్ము తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కొన్నాళ్లుగా వేడుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఇదిగో.. అదిగో.. అనడమే కానీ... డిపాజిట్ దారులకు సొమ్ము చేతికి అందింది లేదు.


ప్రభుత్వం నుంచి బాధితులకు నికరమైన హామీ అంటూ వచ్చింది లేదు. పోరాటాలు, ధర్మాలు చేసినా ఫలితం కనిపించలేదు. కానీ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే సమస్య పరిష్కారం కోసం కీలకమైన నిర్ణయాలు తీసకుంటోంది.


జగన్ ప్రభుత్వం బాధితులకు డబ్బులు అందచేసేందుకు బడ్జెట్‌లో 11 వందల 50 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆనాడు జగన్ స్వయంగా ప్రకటించారు. మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడు వెయ్యి కోట్లకుపైగా నిధులు కేటాయించి బాధితులకు మేలు చేస్తామని భరోసా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: