ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ కు రోజు ఏదొక ట్విట్ పెట్టకపోతే నిద్రపట్టదు ఏమో. అందుకే నారా లోకేష్ అవసరమున్న లేకున్నా ట్విట్టర్ ని తేగా వాడేస్తున్నాడు ట్విట్టర్ పిట్టా నారా లోకేష్. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అయన మనసు శాంతంగా ఉన్నట్టుగా లేదు. 


రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఏదొక కారణం చేత విమర్శిస్తూనే ఉంటారు. కొన్ని సార్లు తప్పు లేకున్నా విమర్శలు చేసి నెటిజన్ల చేత చివాట్లు కూడా తింటుంటారు. ఇప్పుడు కూడా అదే పని చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ను రాష్ట్ర ప్రజలు అందరూ బాగుంది అంటూ సోషల్ మీడియా వేధికగా పోస్ట్ చేస్తుంటే, నారా లోకేష్ మాత్రం ఆ బడ్జెట్ ను విమర్శించారు. ఆ బడ్జెట్ ను విన ప్రజలు గురకలు పెట్టి నిద్రపోతున్నారు అని కామెంట్ చేసారు. 


నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఇలా రాశారు. 'తమ ప్రభుత్వం కోసిన కోతలకు, బడ్జెట్ లో కేటాయించిన నిధులకు పొంతన లేదన్న విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. సొంత పార్టీ నేతలే గుర్రుపెట్టారంటే @ysjagan గారి హామీలన్నీ గుర్తుంచుకుని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో?'' అని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ట్విట్ కి నారా లోకేష్ మైండ్ బ్లాక్ అయ్యే సమాధానాలు 'రిట్విట్'లగా  వచ్చాయి. 


ఆ రిట్విట్లలో ఒక నెటిజన్ నారా లోకేష్ కు ఘాటుగా సమాధానం చెప్పారు. ఆ రిట్విట్ ఇదే ''అయ్యా లోకేశ్ గారు, సున్నా వడ్డీ రుణాలకు సున్నా చుట్టారు అని అసెంబ్లీలో నేడు వైసిపి వారు నిరూపించారు. ఇది మీ పాలన కాదు సర్, హోర్డింగ్ లలో ఒక్కటి, బడ్జెట్ పేపర్లలో ఒక్కటి ఉండటానికి. ఏవైతో చేస్తాం అని చెప్పారో అవే బడ్జెట్ లో ఉన్నాయి''. అంటూ రిట్విట్లు చేసారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: