ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వేసిన పంచ్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పడిపడినవ్వారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటూ..తన పార్టీ వారు చంద్రబాబు డౌన్ డౌన్ అంటుంటే ఇంకెంత డౌన్ కెళ్తారు..ఇప్పటికే ఆయన చాలా డౌన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అయినా ఇంకా బుద్ధి మారలేదంటూ ధ్వజమెత్తారు. 

అంబటి ప్రతిపక్ష నేతల గురించి మాట్లాడుతూ..వారి వద్ద పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండొచ్చు కానీ...ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత దాని గురించి ప్రస్తావిస్తే బాగుంటుందని అన్నారు.  ఆ సమయానికి ప్రతిపక్ష నేతలు గట్టిగా అరవడంతో ఇదేం బాగాలేదని ప్రతిపక్ష నాయకులను వారి అధినేత ఓ ఆర్డర్ లో కూర్చొబెడితే బాగుంటుందని అన్నారు.   వారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అచ్చం నాయుడు దగ్గర ఉందో..బుచ్చయ్య చౌదరి దగ్గర ఉందో తర్వాత మాట్లాడాలని అన్నారు. 

మీరు ఇలా లొల్లి చేస్తే బాగుండదని..మీరు ఇరవై మూడు మందే ఉన్నారు..మేం 150 మందిమి ఉన్నాం..అరిస్తే కనిపించకుండా పోతారని అన్నారు...ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నానని అన్నారు.  రైతులకు బ్రహ్మాండంగా చేశామన్నారు..రైతుకు వారి ప్రభుత్వం ఏం చేశారో ప్రజలందరి తెలుసు..వీరు బట్టలు పెడతాం అని తీసుకు వచ్చి శుబ్బరంగా బట్టలన్నీ ఊడదీసి వారికి గోచి ఇచ్చారు అధ్యక్షా..ఇప్పుడు మేం గోచీ ఇచ్చాం..గోచీ ఇచ్చాం ఇక పండుగ చేసుకోండీ అని అంటే గోచీతో పండగేంటీ అధ్యక్షా అన్నారు. మీరు రైతులకు చేసిన మేలుకు ఘనమైన సత్కారం చేసి 23 మందినిక మీకు ఇచ్చారని అన్నారు... అంతే సభలో ఉన్నవారంతో గొల్లున నవ్వారు..వారితో పాటు సీఎం జగన్ కూడా పగలబడి నవ్వారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: