Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 10:30 pm IST

Menu &Sections

Search

రైల్వేను ప్రైవేటీకరణ చెయ్యం... కేంద్ర మంత్రి పియూష్ గోయల్

రైల్వేను ప్రైవేటీకరణ చెయ్యం... కేంద్ర మంత్రి పియూష్ గోయల్
రైల్వేను ప్రైవేటీకరణ చెయ్యం... కేంద్ర మంత్రి పియూష్ గోయల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రైవేటు సంస్థల పరం కానుందంటూ వస్తున్న వార్తలను కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ వివరణ ఇచ్చారు. రైల్వేలను ప్రైవేటీకరించమని గోయల్‌ స్పష్టం చేశారు. శుక్రవారం లోక్‌సభలో మాట్లాడుతూ రైల్వేల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా నూతన రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు.  కొన్ని యూనిట్ల కార్పొరేటీకరణకూ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

గత శుక్రవారం పార్లమెంట్‌లో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైల్వేలను బలోపేతం చేసేలా ఉందన్నారు. రానున్న పదేళ్లలో రైల్వేలో దాదాపు 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని రైల్వే సమస్యలకు పరిష్కారాన్ని సూచించే విధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారన్నారు.

పేద, ధనిక తారతమ్యం లేని బడ్జెట్‌ ఇదని.. మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌, ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు.  బడ్జెట్‌ 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ చేస్తోన్న విమర్శల్ని ఆయన కొట్టి పారేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ప్రవేశ పెట్టిన ఒక్క బడ్జెట్‌ కూడా ప్రజలను మెప్పించలేకపోయిందని మండి పడ్డారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లన్ని గాలిలో మేడలు నిర్మించాయని అందుకే ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని పియూష్‌ గోయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో రైల్వే బడ్జెట్లలో రాజకీయ ప్రయోజనాల కోసం నూతన రైళ్లపై ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు గుప్పించేవారని మండిపడ్డారు. రాయ్‌బరేలిలోని మోడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో కాంగ్రెస్‌ హయాంలో ఉత్పత్తి ప్రారంభం కాలేదని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 ఆగస్ట్‌లో తొలి కోచ్‌ తయారైందని చెప్పుకొచ్చారు. విజేతలు లక్ష్యం దిశగా దూసుకుపోవడంపైనే దృష్టిసారిస్తారని, పరాజితులు కష్టాలను చూసి డీలాపడతారని వ్యాఖ్యానించారు.
goyal
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.