ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ త్వరలో 'ట్విట్టర్ టీవీ' స్థాపించనున్నారట. నారా లోకేష్ గత కొంతకాలంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భమే లేదు... అలాంటిది నారా లోకేష్ ట్విట్టర్ టీవీ పెట్టనున్నారన్న ప్రచారం అందరి మనసుల్లో ప్రశ్నలను పుట్టిస్తోంది.   


ఆనందపడాలన్న, కోపడాలన్న, విమర్శించాలన్న, అభినందినచాలన్న ఆకరికి పరామర్శించాలన్న కూడా ట్విట్టర్ నే వేదిక చేసుకున్నారు నారా లోకేష్. మీకు (ప్రజలకు) సమస్య వస్తే నాదగ్గరకు రండి అంటూ ట్విట్టర్ లోనే పిలిచారు. నీ ట్విట్టర్ ను ఫాలో అయ్యే ప్రజలు మాత్రమే నీ దగ్గరకు వస్తారు నారా లోకేష్ గారు అంటూ కామెంట్ చేశారు కొంతమంది నెటిజన్లు. ఈ కామెంట్ కు స్పందించిన ఓ నెటిజను అనుకోని రీతిలో వాళ్లకు సమాధానం చెప్పారు. 


ఆ సమాధానం ఏంటంటే 'ట్విట్టర్ ఉన్న ప్రజలే నారా లోకేష్ పిలుపుని తీసుకోగలరు, సమస్యలు ఉన్న ప్రజలు అందరూ నారా లోకేష్ వద్దకు రావాలంటే కొంచం కష్టమే.. అందుకే నారా లోకేష్ గారు మీడియా ముందుకు రాకుండానే.. మీడియానే అయన ట్విట్లను కవర్ చెయ్యడానికి 'నారా వారి ట్విట్టర్ టీవీ' అని ఒక 'టీవీ ఛానల్'ని స్ధాపించనున్నారు, ఆ టీవిలో కేవలం నారా లోకేష్ ట్విట్లు, చంద్రబాబు నాయుడు ట్విట్లు ప్రజలకు అర్థమయ్యేలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ టీవీని రన్ చేస్తారు' అంటూ ట్విట్ చేసాడు ఆ నెటిజన్.


ఈ ట్విట్ కు రియాక్ట్ అయినా కొంతమంది నిజమేలే అతనూ మీడియా ముందుకు వస్తే ఏదొక కామెడీ చేస్తాడు. అతని మాటలకూ వాయిస్ ఓవర్ ఇవ్వడమే మంచిది అంటూ ట్విట్ చేశారు నెటిజన్లు. దింతో ప్రస్తతం ఈ ట్విట్ వైరల్ అవుతుంది. అయితే నారా లోకేష్ నిజంగా 'నారా వారి ట్విట్టర్ టీవీ'ని స్థాపించనున్నారా ? అనేది నెటిజన్ల మనసులో ప్రశ్న అయిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: