ఆ రైతుకు పంటలు కలిసిరాలేదు. మరో వైపు చేసిన అప్పులుకు వడ్డీలు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతుండేవాడు. దీనికి తోడు గతేడాది వచ్చిన తితిలి తుఫాన్ తో ఉన్న కొబ్బరి , జీడీ పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి నష్టపరిహారం పబించలేదు. అప్పులు తీర్చలేనని ఒత్తిడి పెరగడంతో ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మందస మండలంలోని ఉద్దాన ప్రాంతంలో చోటుచేసుకుంది. 2018 వ అక్టోబర్ లో సంభవించిన తితిలి తుఫాను ఉద్దానాన్ని సర్వనాశనం చేసింది. రైతులకు తీవ్ర నష్టాలను కలుగచేసింది. 


నేటికీ తుఫాను కష్టాలు ఉద్దానాన్ని విడడంలేదు. అప్పటికే చేసిన అప్పులు , తుఫాను నష్టం కలిసి భాదపల్లికి చెందిన కొండే దానయ్య (52) అనే రైతును బలిగొన్నాయి. ఆర్ధిక ఇబ్బందులకు గురైన దానయ్య చెట్టుకు ఉరి వేసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. దానయ్యకు గ్రామంలో సుమారు రెండున్నర ఎకరాల వరకు భూమి ఉండేది. భార్య మీనమ్మ, కుమారులు జయరాం, క్రుష్ణారావు లతో కొబ్బరి , జీడీ పంటలపై వ్యవసాయం చేసుకుని గడుపుతుండేవాడు. పిల్లల చదువుకోసం అని కొంత అప్పుచేసాడు. కుటుంబం పోషణ కోసమని కొంత అప్పుచేసాడు. గతేడాది తితిలి తుఫాను దానయ్యను తీవ్ర నష్టానికి గురిచేసింది. 


తుఫాను పరిహారం అంతంతమాత్రంగానే అందింది. సుమారు రూ.12 లక్షల వరకు దానయ్య అప్పులో కురుకుపోయాడని తెలుస్తుంది.
భూమి ఉన్నప్పటికీ ఫలసాయం లేకపోవడం.. అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఇటీవలే దానయ్య తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. కుమారులు కూలి, నాలి చేసుకుంటూ ఉండేవారు. కుమారుడు జయరాం కు ఇటీవలే వివాహం కూడా చేశాడు. అంతంతమాత్రంగా వస్తున్న ఆదాయంతో చేసిన అప్పులు ఎలా తీర్చగలమని ఇంట్లో బాధపడుతుండేవాడు. వీటన్నింటిని తట్టుకోలేక చావే శరణ్యమని ఉరివేసుకునట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: