పాలకొండ చివరి ప్రాంత రైతులకే తోలి ప్రాధాన్యతని, రైతులు సాగు నీటిని  పొదుపుగా వాడాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టుకు (నాగావళి నదిపై) వద్ద పాత ఆయకట్టు కాలువలకు నీటిని విడుదల చేసారు. ప్రతి సెంట్ భూమికి సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద ఎడమ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. అనంతరం నీటిని నేరుగా పాలకొండ చివరి వరకు వెళ్లేలా  చర్యలు చేపట్టాలని నివాస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. 


అనంతరం తోటపల్లి  ప్రాజెక్ట్ గురించి ఆరా తీశారు. ప్రాజెక్ట్ ఎస్ ఈ పోళీశ్వర రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్యాచ్ మెంట్ ఏరియా అయినా ఒడిశాలో కురిసే వర్షాల పైనే ప్రాజెక్టులో నీటి మట్టం ఆధారపడి ఉంటుందని ఎస్ ఈ తెలిపారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 2.5 టిఎంసిల నీటి మట్టం ఉందన్నారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 105 మీటర్లు అయితే ప్రస్తుతం 104.3 మీటర్లు నీటి నిల్వ ఉందని వివరించారు. ఈ ఏడాది  తీవ్ర వర్ష భావ పరిస్థితులు ఉండడంతో భూమి బాగా పొడిబారిపోయిందన్నారు.


కాలువల ద్వారా నీరు చివరకు చేరేసరికి కొంత సమయం పడుతుందన్నారు.  ప్రాజెక్టులో  తగిన నీటి మట్టం లేకపోతే ఖరిఫ్ కు నీటి ఇబ్బందులు తప్పవని అన్నారు. వర్షాలు కురిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన తోటపల్లి కాలువల్లో ఇటీవల జరిగిన ఆధునీకరణ పనులు గూర్చి కలెక్టర్ నివాస్ ఆరాతీశారు. 41.44 కిలోమీటర్లు పొడువు ఉన్న నాగావళి ఎడమ కాలువ పరిధిలో 35,602 ఎకరాల ఆయకట్టు ఉందని ఎస్ఈ  రాంబాబు తెలియజేసారు.20 కిలో మీటర్లు పొడవు ఉన్న పాత కుడి కాలు పరిధిలో 10 వేల ఎకరాల   ఆయకట్టు ఉందని ,  మరో 20 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు.


లష్కర్లను నియమించమని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కుడి , ఎడమ కాలువల ద్వారా వచ్చే నీటి సరఫరాలు పరిశీలించేందుకు సిబ్బంది కొరత ఉందని ఎస్ ఈ రాంబాబు నివాస్ కు  తెలిపారు. గతంలో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వనందున ఎవరు ముందుకు రాయడం లేదన్నారు. ఆ విషయాన్ని పరిశీస్తామని కలెక్టర్ అన్నారు. తక్షణమే లష్కర్లను నియమించాలని ఎస్ ఈ ని ఆదేశించారు. ఎడమ కాలువ రెగ్యులేటర్ నిర్వహణ పాడయిందని , దీని వళ్ళ నీటి వృధా ఎక్కువగా ఉందని పలువురు రైతులు కలెక్టర్ ద్రుష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నివాస్ హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: