నేడు ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షం నుంచి విమర్శలు భారీగా వస్తున్నాయి. చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరుకు ప్రతి ఒక్కరు బడ్జెట్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా వైఎస్ జగన్ ను 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని సంచలన వ్యాఖ్య కూడా చేసారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఆర్థికమంత్రి నోరు జారారు. 


వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బడ్జెట్'లో ప్రచారం తప్ప పసలేదన్నార మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణ. ఈ వ్యాఖ్యపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్ పై యనమాల రామకృష్ణ చేసిన మాటలు వింటే నవ్వొస్తుందని జోగి రమేష్ అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం బడ్జెట్ చూసి యనమల రామకృష్ణుడికి కళ్లు పోయినట్టున్నాయి అని జోగి రమేష్ విమర్శించారు. 


వైఎస్ జగన్ రాజ్యంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లోనే అన్ని వర్గాల ప్రజలకు పెద్ద పిటా వేశారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. నవరత్నాల పథకం ప్రజలకు చేరడానికి 80 శాతం బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. ఎన్నికలలో చెప్పిన ప్రతి పథకం ప్రజలకు అందేలా బడ్జెట్ రూపొందించారని.. బడ్జెట్ చుసిన యనమలకు కళ్ళు పోయాయా అని ప్రశ్నించారు. కాగా త్వరలోనే 30 కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీ నేతలు తిన్న సొమ్ముని కక్కిస్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ వర్ణింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై యనమల ఎలా స్పందిస్తారో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: