Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 10:35 pm IST

Menu &Sections

Search

క‌ల నెర‌వేర్చుకునేందుకు కేసీఆర్ ప్ర‌త్యేక స్కెచ్‌

క‌ల నెర‌వేర్చుకునేందుకు కేసీఆర్ ప్ర‌త్యేక స్కెచ్‌
క‌ల నెర‌వేర్చుకునేందుకు కేసీఆర్ ప్ర‌త్యేక స్కెచ్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కే చంద్రశేఖర్‌రావు త‌న మ‌రో క‌ల నెవేరర్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ఈ నెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం తాజాగా శాసనసభ ప్ర‌త్యేక‌ సమావేశాల నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 18న కొత్త మున్సిపాలిటీ చట్టం బిల్లు ప్రతులను ఎమ్మెల్యేలకు అందించనున్నారు. బిల్లుపై 19న చర్చించి ఆమోదం తెలుపనున్నారు. 


జులై 18వ తేదీ ఉదయం 11 గంటలకు శాస‌న‌స‌భ స‌మావేశం ప్రారంభంకానుంది. జులై 19న మధ్యాహ్నం 2 గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభంకానుంది. ఉభ‌య స‌భ‌ల్లో నూత‌న మున్సిపల్ చట్టంపై చర్చించి ఆమోదం తెల‌ప‌నున్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఉద్దేశించినవని, ప్రశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉండవని సీఎం కార్యాలయం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో నూతన మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి ముసాయిదా చట్టాన్ని ఇప్పటికే న్యాయశాఖకు పంపించారు. ఆగస్టు మొదటివారంలో పుర ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు. 


ఇదిలాఉండ‌గా,  కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌ల‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ``అవినీతికి ఆస్కారం లేని విధంగా కొత్త రెవెన్యూ చట్టం, మున్సిపల్ చట్టం రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. పట్టణ ప్రాంతాలు ఎలా తీర్చి దిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి పేరుతో పిలవబడే ఐఏఎస్ అధికారి నాయకత్వంలోనే అడిషనల్ కలెక్టర్ లేదా అడిషనల్ డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్స్ అని పిలవబడే ముఖ్య అధికారుల బృందంతో జిల్లాస్థాయి పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు.. తదితర పనులన్నీ అధికారిక బృందం ఆధ్వర్యంలోనే జరగాలి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలి.`` అని తెలిపారు.


ప్రజాప్రతినిధులు, అధికారులుకు ప్రజలు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవీ లేవని కేసీఆర్ తెలిపారు. ``ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పని జరగాలి. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావాల్సిన పనులు జరగాలి. అందుకోసం కఠినమైన కొత్త చట్టాలు తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యంమైపోయాయి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలటీలను, కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అనే పిలవాలా?..లేదా జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా అని ఆలోచించాలి. మున్సిపాలటీలు, కార్పోరేషన్లు, గ్రామపంచాయతీలు, పారిశుధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం నిర్మించాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఇవన్నీఅంశాలు కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపర్చాలి. పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరగాలి`` అని ఆదేశాలు జారీ చేశారు.


మ‌రోవైపు మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ప్రత్యేక అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇస్తున్నది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి, పురపాలకశాఖ సంచాలకులు శ్రీదేవి అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు.
kcr-telangana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అడ్డంగా బుక్క‌యిన పాక్ ప్ర‌ధాని చెల్లెలు...ఆడుకుంటున్న నెటిజ‌న్లు
కేఏ పాల్‌పై అరెస్ట్ వారెంట్‌...ఇక అదొక్క‌టే ఆప్ష‌న్‌
భార‌త్‌ను మ‌ళ్లీ కెలికిన ఇమ్రాన్‌..క‌ట్ట‌డి చేయ‌క‌పోతే అంతే సంగ‌తి
దేశంలో రిజ‌ర్వేష‌న్లు ఎత్తేస్తారా...ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది?
అఫిషియ‌ల్ఃటీడీపీ మాజీ మంత్రి జంప్‌..ఆయ‌న‌తో ప్ర‌త్యేక భేటీ
న‌డ్డా...మీ నాట‌కాలు తెలంగాణ‌లో న‌డ‌వ‌వు
ఆటో రంగానికి ఏమైంది...30 వేల మంది ఎందుకు రోడ్డున ప‌డ్డారు?
సైకిల్ పార్టీలో కొత్త‌ పంచాయ‌తీ...తండ్రి వ‌ర్సెస్ కొడుకుల్లో ఎవ‌రికో ప‌గ్గాలు?
త‌లాక్‌పై అమిత్‌షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...ఆ ముస్లిం దేశాల ప్ర‌స్తావ‌న
తెలంగాణ‌లో బ‌డులు మూత‌...బార్లు ఓపెన్‌
అయోధ్య రామమందిరానికి బంగారు ఇటుక‌...ఆఫ‌ర్ ఇచ్చిన హైద‌రాబాద్ ప్ర‌ముఖుడు ఎవ‌రంటే...
ఆర్థిక మాంద్యంలో భార‌త్‌..బ‌య‌ట‌ప‌డేందుకు మ‌న‌కున్న‌ మార్గాలు ఏంటంటే..
71 గొర్రెలు ఇచ్చాడు...అక్ర‌మ సంబంధం లీగ‌ల్ చేసుకున్నాడు
పిచ్చిప‌ట్టిన ట్రంప్‌...అందుకే ఏప్రిల్ ఫూల్ జోక్ ఇప్పుడు
స‌ముద్రం చుట్టూ గోడ క‌డుదాం..కాదుకాదు కొత్త రాజ‌ధాని క‌ట్టేద్దాం
రాజ్‌నాథ్‌లాంటి దౌర్భాగ్యుడు భార‌త్ ర‌క్ష‌ణ మంత్రి...అది మీ దుర‌దృష్టం
రాయ‌ల‌సీమ‌కు తెలంగాణ నీళ్లు...కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కాఫీడే చెప్పిన గుడ్ న్యూస్ ఇది
పాక్‌తో దోస్తీ..చైనా ప‌రువు గోవిందా...భార‌త్ ఆప‌రేష‌న్ సూప‌ర్‌
కేసీఆర్‌కు బీపీ పెంచిన ఐదు వందల కోట్ల ఖ‌ర్చు అప్‌డేట్‌
ఏపీ మంత్రి సంచ‌ల‌నం...పేర్ని నాని ఏం చేశారంటే...
మైన‌ర్ బాలిక‌పై దారుణం..గ్రామ‌పెద్ద‌కు త‌గిన శిక్ష‌
కేసీఆర్‌పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న విమ‌ర్శ‌లు...కుట్ర పేరుతో..
డ్రోన్ రాజకీయాలు...వైసీపీ, టీడీపీల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
భార‌తీయుల మూడ్ ఒక‌టి..మోదీ స‌ల‌హా ఇంకొక‌టి
పాపం పాక్‌..ఐరాసాలో దిమ్మ‌తిరిగే షాక్‌
నిన్న ఉత్త‌మ పోలీస్‌..నేడు అవినీతిలో దొరికిన చేప‌
తిక్క కుదిరిన ట్రంప్...క‌శ్మీర్ విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న‌
మ‌ద్యపాన నిషేధం...ఏపీ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు
ఏపీ ప్ర‌భుత్వంలో టెర్ర‌రిజం... బ‌డా వ్యాపారవేత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
లండ‌న్‌లో భాతీయుల‌పై దాడి... చేసింది ఎవ‌రో తెలుసా?
క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులు...అవ‌స‌ర‌మైతే అణ్వాయుధాలు వాడ‌ట‌మే
పుర‌పాల‌క చ‌ట్టంపై హైకోర్టులో వాద‌న‌లు..అస‌లు తీర్పు ఎప్పుడంటే
కేంద్ర‌మంత్రి మిస్సయిన వ్య‌క్తికి రాష్ట్రమంత్రి హోదా ఇచ్చిన కేసీఆర్‌
హైద‌రాబాద్ ద‌శ‌ను మార్చే నిర్ణ‌యం..కేసీఆర్ ఓకే అంటే...
డేరాబాబా...జైల్లో ఉండి వాళ్ల‌కు ఎలా చుక్కలు చూపిస్తున్నాడంటే...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.