ఏపీలో జగన్, చంద్రబాబు ఈ ఇద్దరూ ఒకరు చేసిన పనిని మరొకరు మెచ్చలేరు. ఈ ఇద్దరి మధ్యన యుద్ధం రాజకీయలను దాటిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ ఏం చేసినా బాబుకు  వేరేగా ఉంటుంది. మరి బడ్జెట్ పై బాబు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే.


ఎపిలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు ముందు చూపు లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాటలకు, చేతలకు పొంతన లేదనేందుకు బడ్జెట్‌ కేటాయింపులే నిదర్శనమన్నారు. శ్వేతపత్రంలో ఒకలా చెబుతారు.. బడ్జెట్‌లో మరోలా పేర్కొంటారని విమర్శించారు. 2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రూ.6వేలే ఎక్కువ.. ఇవాళ రూ.38 వేలు ఎక్కువ కావడం నాటి టీడీపీ  ప్రభుత్వ ఘనత కాదా? అని ప్రశ్నించారు. 


ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో 49వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వ లెక్కలే చెప్పాయని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు కోతలు పెట్టి ప్రగతికి గండికొట్టారని , పొరుగు రాష్ట్రంలో నీరు పారించడానికే ఎక్కువ శ్రద్దచూపుతున్నారని ఆయన ఆరోపించారు. మొత్తానికి జగన్ బడ్జెట్ ని బాబు తూచ్ అనేశారు. ఇది దేనికీ ఉపయోగపడదని కూడా తేల్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: