తొలి బడ్జెట్ లోనే జగన్ తాను ఎవరి పక్షపాతినో చెప్పకనే చెప్పేశారు. రైతు సంక్షేమం కోసం భారీగానే కేటాయింపులు చేశారు. రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. రైతాంగానికి తాత్కాలిక ఉపశమనం కలిగించడమే కాదు.. దీర్గకాలికంగా మేలు చేసే విధంగా బడ్జెట్ సాగింది.


వ్యవసాయ రంగ బడ్జెట్‌ మొత్తం 28,866.23 కోట్లుగా ఉంది. ప్రతి సంవత్సరం మే నెలలో ఒకొక్క రైతు కుటుంబానికి రైతు భరోసా పథకం కింద 12,500 రూపాయల చొప్పున సాయం అందివ్వాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా 64.05 లక్షల రైతు కుటుంబాలు మేలు జరుగుతుంది.


ఇలా లబ్ది పొందేవారిలో 15.37 లక్షల కౌలు రైతులు కూడా ఉండటం విశేషం. దీనికోసం బడ్జెట్‌లో 8,750 కోట్లు ప్రతిపాదించారు. భూ యాజమనుల హక్కులకు విఘాతం కలుగకుండా కౌలు చట్టంలో సమూల మార్పులు తీసుకురావడానికి జగన్ సర్కారు సంకల్పించింది. రైతులపై పంట బీమా ప్రీమియం భారం పడకుండా ఉండేందుకు వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమా పథకం తీసుకురావడం జరిగింది.


అన్ని పంటలకు రైతులు చెల్సించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీని కోసం బడ్జెట్‌లో 1163 కోట్లు ప్రతిపాదించారు. రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆత్మహత్యలు పాల్పడిన రైతుల కుటుంబాలు రోడ్డున పడకుండా 7 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వ నిర్ణయించింది.దీని కోసం బడ్జెట్‌ 100 కోట్లు ప్రతిపాదించింది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బడ్జెట్‌లో 3వేల కోట్ల ప్రతిపాదించడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: