రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగం విషయంలో భారీ లక్ష్యాలే విధించుకుంది. పోలవరం జూన్‌ 2021 నాటికి అధిక ప్రాధాన్యంతో పూర్తి చేయడానికి, తగిన బడ్జెట్‌ను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. మానవతా దృక్పథంతో ప్రాజెక్టు ప్రభావిత కేటాయింపును, పునరావాసాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది.


అలాగే.. ఒక సంవత్సర కాలంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు స్వరంగం పూర్తికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. అవుకు స్వరంగాన్ని పూర్తి చేస్తూ ఒక సంవత్సరంలో గాలేరు–నగరి ప్రాజెక్టు ఒకటవ దశను పూర్తి చేసేందుకు గండికోట రిజర్వాయర్‌లో నీటి నిల్వ, కడప జిల్లాలోని ఆయకట్టు దారులకు నీటి సరఫరా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందట.


కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.98 లక్షల ఎకరాలకు సాగునీరు కల్పించేందుకు హంద్రీనీవా సృజల స్రవంతి ఒకటవ దశను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటారట.అనంతపురం, చిత్తూరులోని చెరువులను నింపేందుకు రెండవ దశను పూర్తి చేస్తారట. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు వంశధార, సర్దార్‌ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తారట.


అయితే ఇన్ని ఘనమైన లక్ష్యాలు నిర్ధేశించుకున్న జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు రాష్ట్రంలో సరస్సులు, చెరువులను పునరుద్ధరించేందుకు 2019–20 సంవత్సరంలో 13139 కోట్లు మాత్రమే కేటాయించింది. మరి ఈ సొమ్ముతో పైన పేర్కొన్న లక్ష్యాలు అందుకోగలరా..?


మరింత సమాచారం తెలుసుకోండి: