ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహచరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభలో వాకౌట్ చేశారు. రాష్ట్రంలో జగన్ కేంద్రంలో విజయసాయి రెడ్డి బిసిల కోసం చాలా పట్లు పడుతున్నారు. రాష్ట్రంలో బిసిలకు హామీలు ఇచ్చినట్టే వైఎస్ జగన్ అత్యధిక మంత్రి పదువులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విజయ సాయి రెడ్డి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చించారు.


అయితే కేంద్రమంత్రి రవిశంకర్ బిల్లు వెనక్కు తీసుకోవాలని కోరారు. బిల్లుపై ఓటింగ్ జరపాలని విజయసాయి వాదించగా అది సాధ్యం కాదని, బిల్లుపై ఓటింగ్‌ సాధ్యం కాదని రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. కాగా కాంగ్రెస్‌ మిత్రపక్షాలతో సహా అనేక పార్టీలు విజయసాయి రెడ్డి బిల్లుకి మద్దతు ఇచ్చారు. అప్పటికి కేంద్రం ససేమిరా అనేసరికి ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా విజయసాయిరెడ్డి సభ నుంచి వాకౌట్‌ చేశారు.


ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేసారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ప్రభుత్వం 60 శాతం పదవులు వెనుకబడిని వర్గాలకే ఇచ్చిందని, కేంద్రం కూడా బిసిలకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాం అని విజయ సాయి రెడ్డి డిమాండ్ చేసారు. విజయ సాయి రెడ్డి డిమాండ్లకు కేంద్రం దిగొస్తుందా ? బీసీలకు కేంద్రం న్యాయం చేస్తుందా ? విజయసాయి రెడ్డి డిమాండ్ సక్సెస్ అవుతుందా అనేది చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: