అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు.. రైతు సమస్యలపై మాట్లాడిన సమయంలో జగన్ టీడీపీ నేతల వాదనను తప్పుబట్టారు. సున్నా వడ్డీకి రైతుకు రుణాలు ఇవ్వడం కొత్త కాదని.. గతంలో టీడీపీ కూడా ఇచ్చిందని టీడీపీ నేతలు సభలో మాట్లాడారు.


ఆ తర్వాత వైఎస్ జగన్ ఇదే అంశంపై మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ రైతులకు సున్నా వడ్డీ రుణాలు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని అన్నారు. పోనీ అంతటితో ఆగారా.. లేదు... రికార్డులు తెప్పిస్తా.. టీడీపీ ఇవ్వలేదని తేలితే చంద్రబాబు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు.


ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. ఓ మాజీ ముఖ్యమంత్రిపై ఆ రేంజ్ లో సవాల్ చేసేటప్పుడు ఒక్కసారి డాటాను క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. మరి అధికారులు తప్పుదోవ పట్టించారా..లేదా జగన్ అవగాహన లేకుండా మాట్లాడారో తెలియదు కానీ.. జగన్ మాత్రం ఈ విషయంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇక ఇదే దొరికింది ఛాన్సు అంటూ.. ఈ విషయాన్ని తెలుగుదేశం పైచేయి సాధించేందుకు ప్రయత్నించింది.


జగన్ దాడితో మొదట బిత్తరపోయిన తెలుగుదేశం.. ఆ తర్వాత లెక్కలు తీసింది. తమ హయాంలో దాదాపు 900 కోట్ల వరకూ వడ్డీలేని రుణం ఇచ్చామని ఆధారాలతో చెప్పింది. దాంతో జగన్ తన వాదనను ఏదో ఒక మాట చెప్పి సమర్థించుకోవాల్సి వచ్చింది. మరి ఇలా ఎందుకు అయ్యింది. అధికారులు ఎలాంటి సమాచారం ఇచ్చారు..అన్నది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: