అసెంబ్లీ సమావేశాల రెండో రోజు.. వైఎస్ జగన్ కాస్త సంయమనం కోల్పోయారు. తెలుగుదేశం నేతలు పదే పదే తన ప్రసంగానికి అడ్డుపడుతున్నవేళ సహనం కోల్పోయారు. ముఖ్యమంత్రిని మాట్లాడుతుంటే అఢ్డుపడతారా.. చంద్రబాబు మాట్లాడినప్పుడు మావాళ్లు ఇలాగే చేశారా అంటూ మండిపడ్డారు.


అంత వరకూ బాగానే ఉంది.. కానీ ఆ తర్వాత జగన్ కాస్త శ్రుతి తప్పారు. మావాళ్లు 151 మంది ఉన్నారు. మీరు 23 మందే ఉన్నారు. మావాళ్లు తలచుకుంటే మీరు ఒక్క నిమిషం కూడా సభలో ఉండలేరు.. అంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు.


అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని.. ఉద్దేశించి.. సైజు పెరగ్గానే సరిగాదు.. కాస్త బుర్ర కూడా పెరగాలి అంటూ కామెంట్ చేశారు. అంతే కాదు.. పదే పదే అచ్చెన్నాయుడిని కూర్చో.. కూర్చో.. కూర్చో.. అంటూ హుంకరించారు. ఇదంతా ప్రతిపక్షం కాస్త దారి తప్పినప్పుడు జరిగిన సన్నివేశమే.


కానీ.. జగన్ అలా దూకుడుగా మాట్లాడటం.. ఈ దృశ్యాలు పదే పదే మీడియాలో రావడం.. జగన్ ఇమేజ్ కే ప్రమాదకరం. మంద బలం ఉన్నంత మాత్రాన మేం మిమ్మల్ని ఏదో చేస్తాం అని బెదిరించడం ఆయనపై ఏర్పడుతున్న పాజిటివ్ నెస్ ను తగ్గిస్తుంది. అచ్చెన్నాయుడి లావుపై పదే పదే మాట్లాడటం కూడా సీఎం స్థాయికి తగదు. జగన్ ఈ ప్రవర్తన కాస్త మార్చుకుంటే మరిన్ని మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: