Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 2:41 pm IST

Menu &Sections

Search

ఆ జిల్లా నేతలకు ఏమైంది ... ఎందుకు మౌనంగా ఉన్నారు ?

ఆ జిల్లా నేతలకు ఏమైంది ... ఎందుకు మౌనంగా ఉన్నారు ?
ఆ జిల్లా నేతలకు ఏమైంది ... ఎందుకు మౌనంగా ఉన్నారు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గుంటూరు తెలుగుదేశం పార్టీ నేతలకు ఏమైంది.  ఒక్కరు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.  పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా తామే అన్నట్లు  వ్యవహరించిన  నాయకులు, ఇప్పుడు పార్టీ కార్యక్రమాలంటేనే ముఖం  చాటేస్తున్నారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఘోరంగా ఓటమి పాలు కావడంతో గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ అగ్ర నాయకులు సైలెంట్ అయిపోయారు.  కోడెల శివప్రసాదరావు , ప్రత్తిపాటి  పుల్లారావు,  దూళిపాళ్ల నరేంద్ర,  ఆలపాటి రాజా,  యరపతినేని శ్రీనివాసరావు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా గతం లో  పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత సీనియర్ నాయకుల్లో   నైరాశ్యం కన్పిస్తోంది .


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వయసు పైబడటం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేష్ సమర్థవంతమైన నాయకుడిగా తనని తాను  నిరూపించుకో లేకపోవడంతో సీనియర్లకు , మళ్ళీ  పార్టీ  అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . ఎన్నికల్లో పార్టీ , వ్యక్తిగతంగా తన  ఓటమి తర్వాత కూడా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ యాక్టివ్ గానే కన్పించారు . కానీ  ఆయన  కొడుకు, కూతురు పై వచ్చిన అవినీతి,  అక్రమాల ఆరోపణలతో కోడెల ఆత్మరక్షణ లో పడిపోయారు .  ఇప్పుడు  ఆయన అధికార  పార్టీ పై దాడి చేసే పరిస్థితిలో లేరని , తన  కూతురు,  కొడుకు కేసుల నుంచి ఎలా బయట పడతారన్న బెంగతో  ఉన్నట్లు సమాచారం.  దేశం పార్టీ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో పార్టీ  ఓటమి తర్వాత ముఖ్య నాయకులను కలుస్తూ,  చిన్న చిన్న సమావేశాలు నిర్వహిస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారే...    తప్పితే,  పార్టీ  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.


  ఇక దూళిపాళ్ల నరేంద్ర ఆలపాటి రాజాను అది కూడా అదే పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  దూళిపాళ్ల నరేంద్ర మంత్రి పదవి ఆశించారు.  చంద్రబాబు నాయుడు కూడా ఆయన మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.  కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు.  దాంతో నరేంద్ర అలిగి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రస్తుతం ఆయన పార్టీ కార్యక్రమాల పట్ల అంటి , ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న  వాదనలు వినిపిస్తున్నాయి.  ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగానే కృషి చేస్తున్నారు.  కానీ పార్టీ సీనియర్లు మాత్రం ఇంకా ఓటమి నైరాశ్యం నుంచి బయటకు రాకపోవడం క్యాడర్లో ఆందోళన రేకెత్తిస్తోంది


tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ కులాలకు మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ... ఇక ఎవరి నిధులు వారికే
సాహో చిత్ర నిర్మాతల రిక్వెస్ట్ కు నో చెప్పిన కేసీఆర్ సర్కార్
సాహో చిత్ర నిర్మాతల రిక్వెస్ట్ కు నో చెప్పిన కేసీఆర్ సర్కార్
కోడెలపై కేసు నమోదు ... అరెస్టు  తరువాయే...
రైతు వేషం  కట్టి ప్రభుత్వంపై విమర్శలు... పెయిడ్ ఆర్టిస్టు అరెస్టు
ఒంటరయిన కోడెల ... ఆశలు వదులుకున్న టీడీపీ అధినేత
ప్రభాస్ సినిమా కు అనుకూలంగా జగన్ నిర్ణయం
టీటీడీ నిధుల గోల్ మాల్ పై విజిలెన్స్ విచారణ షురూ
ఈ-కేవైసీ నమోదు కోసం కష్టాలు ఇన్ని అన్ని కాదు
హవ్వ ...కాలం చెల్లిన నూనె ప్యాకెట్లను పంపిణీ చేస్తారా ?
విద్యుత్ ఒప్పందాల పై సవాళ్లు ... ప్రతిసవాళ్లు
చంద్రబాబు తీరు పట్ల తమ్ముళ్ల  విస్మయం
రోజంతా హైడ్రామా ...కోడెలకు గుండెపోటు
జగన్ ఇకనైనా  తన  దూకుడు ను తగ్గిస్తారా ?
గుత్తా కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
రాజధాని మార్పు అన్నది  మైండ్ గేమ్ లో భాగమేనా ?
మోడీ , షా లకు నిజంగా చెప్పే చేస్తున్నారా ?
అమరావతి లో కాకపోతే ... రాజధాని తమ ప్రాంతం లోనే
హవ్వ ...  నడ్డా ఎవరో తెలియదంటావా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.