ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి.  కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలలో బీజేపీ పాగా వేస్తున్నది.  కర్ణాటకలో మరలా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం అక్కడ సంకీర్ణం అధికారంలో ఉన్నది.  


సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఇబ్బందులు పడ్డారు.  రాజీనామాల కారణంగా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.  అటు గోవాలోని ఇదే పరిస్థితి.  కాంగ్రెస్ పార్టీకి అక్కడ 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  


అందులోని 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  మరోవైపు రాజస్థాన్ లో కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  అయితే, అక్కడ అధికారంలోకి రావాలంటే చాలామంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం.  


ఇలా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిపోవడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్పందించి... నోట్ల రద్దు సమయంలో కూడబెట్టిన డబ్బుతో బీజేపీ ఎమ్మెల్యేలను భారీగా కొనుగోలు చేస్తోందని అన్నారు.  మధ్యప్రదేశ్ లో ఆ దుస్తతి రానివ్వమని, తమకు 121 సభ్యుల బలం ఉందని చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: