నాదెండ్ల భాస్కర రావు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యాడు.  సీనియర్ నాయకుడు కావడంతో ఆయన రాకను బీజేపీ స్వాగతించింది.  నాదెండ్ల బీజేపీలోకి వెళ్లి ఏం చేస్తారు.  ఎలాంటి పనులను ఆ పార్టీలో చక్కదిద్దుతారు అన్నది ప్రస్తుతానికి తెలియవు.  


పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఏదో ఒక పని చేసి తీరాలి.  ఊరికే పార్టీలో ఉంటె బీజేపీ అందుకు ఒప్పుకోదు.  ఎలాగో నాదెండ్ల భాస్కర రావు బీజేపీలో చేరిపోయాడు కాబట్టి ఆయన కొడుకు నాదెండ్ల మనోహర్ ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరుగుతున్నది.  


ఇది కేవలం ప్రచారమేనా లేదంటే.. నిజంగానే ఈ దిశగా అడుగులు పడుతున్నాయా అన్నది తెలియాలి.  మనోహర్ మాత్రం తానూ పార్టీ మారే పరిస్థితి లేదని, జనసేన పార్టీలోనే ఉంటానని అంటున్నాడు.  పవన్ కళ్యాణ్ తోనే కలిసి పనిచేస్తానని చెప్పారు.  


బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో బలం లేదు.  కనీసం జనసేన ఒక్క సీటైనా నెగ్గింది.  అసలు బలమే లేని పార్టీలో చేరడం కంటే కొంత బలం ఉన్న పార్టీలో ఉండటమే మేలు అనుకుంటున్నాడు.  ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ  నుంచి బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్న 12 మంది బీజేపీలో జాయిన్ అయితే.. అప్పుడు ఏమైనా మార్పు జరుగుతుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: